అదిలాబాద్

సదర్‌మాట్‌కు భారీగా వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్ రూరల్, ఆగస్టు 17: మండలంలోని సదర్‌మాట్ ఆనకట్టకు భారీగా వరదనీరువచ్చి పొంగి ప్రవహిస్తుంది. మొన్నటి వరకు సదర్‌మాట్‌లో నామమాత్రంగా ఉన్న నీరు గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి సదర్‌మాట్ జళకళను సంతరించుకుంది. రోజుకు 20 వేల క్యూసెక్కుల నీరు గోదావరి నదిలోకి వెలుతుందని సదర్‌మాట్ ఏఈ రవీందర్ నాయక్ తెలిపారు. అలాగే సదర్‌మాట్ కాలువకు గత 1వ తేదీన ఎమ్మెల్యే రేఖానాయక్ నీటిని విడుదల చేశారు. ఉన్న అరకొర నీరు ఒక్కరోజులోనే ఆనకట్ట ఖాళీ అయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో ఆయకట్టు రైతులు పంటలు వేసుకునేందుకు సిద్దం అవుతున్నారు.

కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
భీమిని, ఆగస్టు 17: ఈ నెల 15వ తేదీన ప్రారంభం అయిన కంటి వెలుగు శిభిరాన్ని శుక్రవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. గత రెండు రోజులుగా కంటి పరీక్షల కేంద్రాల్లో ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. నిర్వహించిన వారికి మందులను, అద్దాలను సక్రమంగా అందించారనే విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షంలో సైతం ప్రజలు కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని సబ్ కలెక్టర్‌కు వైద్యుడు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన శిభిరంలో అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలని గ్రామంలో ప్రతి వ్యక్తికి కంటి పరీక్ష నిర్వహించేలా చూడాలని ఆశాలు, అంగన్‌వాడిలు , గ్రామంలో స మాచారం అందించి అందరిని పరీక్ష కేంద్రానికి వచ్చేలా చేయాలని సిబ్బందికి సూచించారు. కంటి పరీక్షల కోసం వచ్చే వారికి జాగ్రత్తగా పరీక్షలు చేయాలని ఎంత మంది వచ్చిన ఓపికగా పరీక్షలు చేసి అవసరమైన మందులు, కంటి అద్దాలు అందించాలని సూచించారు. ఆపరేషన్ ఆవసరం అయిన వారికి మంచిర్యాలకు తరలించి శస్త్ర చికిత్సలు చేయించాలని దానికి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అక్కడ నుండి కస్తుర్బా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను అడిగి తెలుసుకున్నారు. క్యాబేజీని ఎక్కువ వాడ వద్దని ప్రత్యేక అదికారికి సూచించారు. పాఠశాలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఫ్లాంట్ సక్రమంగా పని చేస్తుందా లేదా ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. స్వచ్చ మైన త్రాగు నీటిని అందించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకునేలా ప్రతి విద్యార్థికి అవగాహాన కల్పించాలని సూచించారు. సబ్ కలెక్టర్ వెంట వైద్య సిబ్బంది ఆర్‌ఐ భీమ్లా, ఎంపిడిఓ శంకర్ తదితరులు ఉన్నారు.