అదిలాబాద్

నిండు కుండలా ప్రాణహిత, పెన్‌గంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, ఆగస్టు 17: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దాటికి ప్రాణహిత పెనుగంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కౌటాల, చింతలమానేపల్లి మండలాల సరిహద్దున ప్రవహిస్తున్న ఈ ప్రాణహిత పెను గంగా నదులు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వరదలతో ఉదృత్తంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో జలమయం చేస్తు ప్రాణహిత, పెను గంగాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి మరింత వరద ఉదృత్తి పెరుగుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాణహిత సంగమ స్థానంలో చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదీని చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు , స్థానిక ప్రజలు వెళ్తున్నారు. కౌటాల, చింతలమానేపల్లి ఎస్సై లు అశోక్, రాజ్‌కుమార్‌లు , కాగజ్‌నగర్ డి ఎస్పీ సాంబయ్య, సిఐ మోహన్ ఆదేశాలతో ప్రత్యేకంగా పర్యటించి అప్రమత్తంగా ఉండాలని స్థానిక పరివాహాక గ్రామాల ప్రజలను మత్స్య కారులను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితులో చేపల వేటకు వెళ్లవద్దని నాటు పడవ ప్రయాణాలు అసలు వద్దని , ఎటువంటి ఆపత్కార పరిస్థితులు ఎదురైన వెంటనే తమకు సమాచారంఅందించాలని ఎస్సై లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కౌటాల, చింతలమానేపల్లి తహసీల్దార్ లు యాకన్న, రవీందర్ నాయక్‌లు వరద ఉదృత్తిని పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరదల దాటికి దెబ్బ తిన్న పంటల వివరాలను నమోదు చేసేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు ఏ ఈ ఓ లు చేపట్టారు.