అదిలాబాద్

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు జల కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, ఆగస్టు 17: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండటంతో జలకళ సంతరించుకుందని ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. శుక్రవారం దండేపల్లి మండలం గూడెం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో చేరిన నీటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంతో పాటు ఉపయోగంలో లేని ప్రాజెక్ట్‌లు రైతులకు ఉపయోగపడే విధంగా యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారన్నారు. వ్యవసాయ రంగంపై శ్రద్ధ చూపుతూ రైతుల పట్ల అపర భగీరథుడుగా నిలిచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలకు నోచు కోలేదన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో కమీషన్‌లు దండుకోవడమే తప్పా ప్రాజెక్ట్‌ల పై అప్పటి ప్రభుత్వం ఆసక్తి చూపలేదన్నారు. తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగంపై ఏమాత్రం కూడా శ్రద్ధ చూపలేదని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగాన్ని అభివృద్ది పరిచే విధంగా అనేక పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ఈ ప్రాంతంలోని పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేయవచ్చని తెలిపారు. ప్రాజెక్ట్‌లపై అప్పటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో వరద నీరు గోదావరిలో చేరి సముద్రంలో కలిసేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ హాయంలో భారీ వర్షాలు కురవడంతో వరద నీరు ప్రాజెక్ట్‌లలోకి చేరి నిండు కండలా కళకళాడుతున్నాయన్నారు. ఆయన వెంట మున్సిపల్ వై స్ చైర్మన్ నల్ల శంకర్, కో ఆప్షన్ సభ్యులు తోట తిరుపతి, కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, ఎగ్గన ఆగరావు, పానుగంటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మంచిర్యాల, ఆగస్టు 17: హాజీపూర్ మండలం గుడిపేట లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోభారీగా వరద నీరుచేరినందున ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. శుక్రవారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వాటర్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌లోని ఇన్‌ఫ్లో లక్షా 20వేల క్యూసెక్కులతో రాగా, ఔట్‌ఫ్లో 80వేల క్యూసెక్కుల నీటిని గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి వదులుతున్నామన్నారు. ప్రాజెక్ట్ స్టోరేజీ 20 టి ఎంసిలకు గాను ప్రస్తుతం 19 టి ఎంసిల నీరు నిల్వ ఉందని తెలిపారు. ప్రాజెక్ట్ అధికారులు ఉదయం నుంచి ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతున్న నీటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ను పరిశీలిస్తు ముందుగా 2 మీటర్ల ఎత్తు నుంచి 33 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు. తెల్లవారుజామున ప్రాజెక్ట్‌లోని నీటి నిల్వను పరిశీలిస్తు 4 గేట్లు మూసి వేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తు గేట్లను ఎత్తుతు, మూసి వేస్తు నీటిమట్టాన్ని ప్రాజెక్ట్ నిల్వ కంటే ఎక్కువగా ఉంచకుండా గోదావరిలోకి వదులుతున్నారు.శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ప్రాజెక్ట్‌లోకి 53 వేల 805 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా అధికారులు పరిశీలించి మొత్తం గేట్లను మూసి వేశారు. 6 గంటల ప్రాంతంలో వర్షం కురవడంతో ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతున్న వరద నీరును పరిశీలిస్తు 7 గంటలకు ప్రాజెక్ట్‌లోని 43 వేల 184 క్యూసెక్కుల నీటిని 8 గేట్లను ఒక మీటర్ ఎత్తుతో ఎత్తి గోదావరిలోకి వదిలారు. అధికారులు నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రాజెక్ట్ నీటి నిల్వలు తగ్గకుండా చూడాలని కోరారు.