అదిలాబాద్

మార్పూ కోసమే బీజేపీకి పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 17: మార్పు కోసం బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని బీజేపీ నాయకురాలు, ఏబీ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డా. స్వర్ణారెడ్డి అన్నారు. ఈ నెల 15 బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిన తరువాత మొదటి సారిగా నిర్మల్ పట్టణానికి రావడంలో సోమవారం సోన్ గోదావరి బ్రిడ్జ్‌పై అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగం పలికారు. నిర్మల్ నియోజకవర్గంలోని స్వర్ణారెడ్డి అభిమానులు, యువత వేల సంఖ్యలో ఉత్సహంతో ర్యాలీలో పాల్గొన్నారు. మాదాపూర్ ఎక్స్‌రోడ్, గంజాల్, కడ్తాల్, మీదుగా సాగిన ర్యాలీలో భారత్ మాతాకీ జై మోడి, స్వర్ణారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని, భీంరెడ్డి అమర్ రహే నినాదంతో మార్మోగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో గల జాతిపిత, అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పించారు. పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రొ. జయశంకర్‌సార్, స్వామి వివేకానంత విగ్రహలకు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ప్రధాన వీధుల గుండా భ్యారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెడ్డి ఫంక్షన్ హల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగు నెలల నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి గ్రామాల్లో గడ గడపకు స్వర్ణమ్మ పేరుతో పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. అయిండ్ల భీంరెడ్డి గత 26 సంవత్సరాల క్రితం చేసిన ఆభివృద్దిపనులను ఇప్పటికి కార్యకర్తలు గుర్తించుకుంటారని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా పట్టణంలో వైద్యురాలిగా ప్రజలకు సేవలందిస్తున్నానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలి ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. నిర్మల్ నియోజకవర్గ ఆభివృద్ది కొరకు బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ఆభివృద్ది, భీంరెడ్డి ఆశయ సాధనకై కృషి చేస్తానని అన్నారు. నిర్మల్‌లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. ప్రజల సమస్యలను పాలకులు పట్టించుకోవడంలేదని వాపోయారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చ లేదని అరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో దేశం ఆభివృద్ధి పథంలో పయని స్తుందన్నారు. ప్రజల సంక్షేమనాకి కేంద్ర ప్రభుత్వ విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకుంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హమీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. మొదటిసారిగా నిర్మల్‌కు వచ్చిన సందర్బంగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 5వేల ద్విచక్రవాహనాలతో ఎన్నడు లేని విధంగా రెట్టింపు ఉత్సహంతో యువత ర్యాలీలో పాల్గొన్నారు. సోన్ నుండి నిర్మల్‌కు చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టిందని అన్నారు. బైక్‌ర్యాలీ నిర్మల్ పట్టణం కాషాయ సముద్రాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రమాదేవి, నాయకులు అయ్యన్నగారి భూమన్న, రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, అంజుకుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.