అదిలాబాద్

ఓటరు నమోదు ప్రక్రియ జిల్లాలో బేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 23: జిల్లాలో ఓటరు జాబితా నుండి భారీ ఎత్తున పేర్లు గల్లంతైన నేపథ్యంలో అధికారులు ప్రతేయక కార్యాచరణతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు సంతృప్తిగా ఉన్నాయని, భారీ ఎత్తున పేర్లు నమోదు చేసుకుంటున్నారని రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కమిషనర్ జనరల్, జిల్లా ప్రత్యేక పరిశీలకులు చిరంజీవులు అన్నారు. ఆదివారం ఓటరు జాబితా ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన చిరంజీవులు కలెక్టర్‌తోకలిసి మావలతో పాటు పలు గ్రామాలను సందర్శించారు. ఈ సంధర్భంగా అధికారులు, పోలీసు సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళిన పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించాలని, 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో నమోదు కోసం అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. అన్ని చోట్ల నమోదు ఫారాలు అందుబాటులో ఉంచాలని చిరంజీవులు అన్నారు. స్థానిక సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటూ ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబ వివరాలు, ఎథిక్‌కార్డుల వివరాలు నమోదు చేసుకోవాలని, అర్హత గల వారికి ఓటు హక్కు కల్పించాయని ఆయన సూచించారు. జిల్లాలో ఈ ప్రక్రియ పనితీరు ఏలా జరుగుతుందో అన్న విషయాలపై కలెక్టర్‌తో అడిగి తెలుసుకున్నారు. రాజకీయ పార్టీలతో మాట్లాడుతూ ఏదైనా అభ్యంతరాలు ఉంటే తమకు సూచనలు అందించాలన్నారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఎజెంట్లను నియమించుకోవాలని, యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ఉయమంలా సవరణ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఓటర్లు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండకుండా చూడాలన్నారు. ఈ సంధర్భంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలకులు చిరంజీవులు తిలకించారు. వృద్దులతో పాటు యువకులకు కూడా ఓటు హక్కు ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మనదేశంలో 1835సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు 30 కోట్లకు పైగా ఓటు హక్కు కలిగి ఉన్నారని, యువత తలుచుకుంటే దేవాన్ని మార్చవద్దని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ నిజాయితీతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ క్యాక్రమంలో జెసి సంధ్యారాణి, ఆర్డీవో సూర్యనారాయణ, డిఆర్‌డిఏ పిడి రాజేశ్వర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
* డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి
* కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు
నిర్మల్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్‌లో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడిని మహేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఎంతో ముందుచూపుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం సర్వస్వం దోచుకుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వినాయక్‌రెడ్డి, సరికెల గంగన్న, అయ్యన్నగారి పోశెట్టి, పొన్నం నారాయణగౌడ్, తక్కల రమణరెడ్డి, జుట్టు దినేష్, సాయన్న, అజర్, హైదర్, అయిర నారాయణరెడ్డి, దేవేందర్‌గౌడ్, రవీందర్, వేణుగోపాల్‌గౌడ్, దశరథ్‌గౌడ్, మురళీగౌడ్, గంగాధర్‌గౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, గుర్రం ఆశన్న, భీంరావు తదితరులు పాల్గొన్నారు.