అదిలాబాద్

పదికి పది స్థానాలు గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 12: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది స్థానాల్లో పదింటిని గెలుపొంది సోనియాగాంధీకి బహుమానంగా ఇస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్ వచ్చినా రాకున్నా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, రానివారికి పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి సారి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన రాహుల్‌గాంధీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఆదిలాబాద్ జిల్లా నుండే శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో ఎఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుండి కాంగ్రెస్‌పార్టీ టికెట్ ఆశిస్తున్న రామారావు పటేల్, గంఢ్రత్ సుజాత, అనిల్ జాదవ్, సాజిద్‌ఖాన్, సోయంబాపురావు, చారులత, జానుబాయి, లీనారావు, దుర్గ్భావాని, దుర్గం అశోక్, శంకర్, నరేష్ జాదవ్‌లతోపాటు స్థానిక నాయకులు తక్కల రమణరెడ్డి, జుట్టు దినేష్, సత్యంచంద్రకాంత్, సరికెల గంగన్న, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

25న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ రాక
12ఏడిబిపి2: జైనూర్‌లో సభస్థలాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
నార్నూర్, అక్టోబర్ 12: ఈనెల 25న టిపిసిసి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ బట్టివిక్రమార్క పర్యటన కుమురంభీం జిల్లాలో ఖరారైందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. శుక్రవారం జైనూర్ మండల కేంద్రంలో బహిరంగ సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు. కుమురంభీం కాంప్లెక్స్ సమీపంలోని మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్‌యు, జైనూర్, లింగాపూర్ మండలాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టేలా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 25వ తేదీన ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్‌తో పాటు రాష్ట్ర నాయకులు విజయశాంతి, డికె అరుణ, జిల్లా నాయకులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా నాయకులు విశ్వప్రసాద్, మంగక్క, ఆ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపిపి విమల ప్రకాష్, నాయకులు అబుద్‌అలీ, పవన్ తదితరులు పాల్గొన్నారు.