అదిలాబాద్

ఢిల్లీ పెత్తనం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 12: ఉద్యమాలతో నిర్మించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ పెత్తనం సహించేది లేదని, ఇక్కడి సమస్యలు స్థానిక పాలకులకే తెలుస్తాయని అపద్దర్మ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గానగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో అపద్దర్మ మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కాలనీకి వచ్చిన మంత్రి రామన్నకు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి నాయకులు అన్నరావు, మహేష్, సురేష్ అధ్వర్యంలో సుమారు 150 మంది యువకులు, మహిళలు, కాలనీవాసులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి రా మన్న గులాబి కండువాలు కప్పుతూ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న మాట్లాడు తూ సీమాంద్ర పాలకులు 70 ఏళ్ళ పాలనలో చేయని అభివృద్దిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ళ కాలంలోనే చేసి చూపించిందన్నారు. ఢిల్లీ, అమరావతి నుండి పాలన సాగిస్తే అభివృద్ది జరగదని, తెలంగాణలో పుట్టిన టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యపడుతుందన్నారు. నల్లధనం పేరిట బిజెపి పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని గుర్తుచేశారు. మహాకూటమి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మల మారిందన్నారు. ట్రాక్టర్, ఆటోడ్రైవర్లకు జోగు పౌండేషన్ అధ్వర్యంలో లైసెన్స్‌లను అందిస్తామని అన్నారు. టీ ఆర్ ఎస్ అభివృద్ది చేయలేదని మాట్లాడుతున్న బిజపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఒకసారి ఆయన ఇంటిముందు రోడ్డును తమ ప్రభుత్వం కాకుంటే బిజెపి ప్రభుత్వం వేసిందా అని సూటిగా ప్రశ్నించారు. పాయల శంకర్ సొంత గ్రామంలోనే అనేక అభివృద్ది పనులు చేశామని గుర్తు చేశారు.