అదిలాబాద్

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 12: డిసెంబర్ 7న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా యువత అవగాహణ కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీని ఎన్టీ ఆర్ మినీ స్టేడియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1 జనవరి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత అందరు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతీఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్లను చైతన్యవంతులను చేయుటకు యువత ప్రభుత్వ బ్రాండ్ అంబాజిడర్లుగా పనిచేయాలన్నారు. యువత ఓ టింగ్‌లో తాము పాల్గొనడంతోపాటు తమ తల్లితండ్రులు, బంధువులు, గ్రామం లో ఓటుహక్కు ఉన్నవారందరు ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్యవంతులను చే యాలన్నారు. గత 2014 ఎన్నికల్లో జిల్లాలో 74 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని, 45 శాతం పట్టణ ప్రాంతాల్లోని పాల్గొన్నారని, జిల్లాలో 85 కంటే ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొనేలా యువత ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం నుండి ఇంద్రనగర్, శాస్ర్తీనగర్, మంచిర్యాల చౌరస్తా, ఈ ద్గాం, కోర్టు మీదుగా ఎన్టీ ఆర్ స్టేడియంకు చేరుకుంది. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి, సిఐ జాన్ దివాకర్, తదితరులు పాల్గొన్నారు.