అదిలాబాద్

నియోజకవర్గాలకు ఈవీఎంల రాండమైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 12: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొదటిస్థాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రాండమైజేషన్ అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, నియోజకవర్గ పరిధిలో కేటాయించ డం జరిగిందని జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రా జకీయ పార్టీలతో సమీక్షా నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 699 పోలింగ్‌కేంద్రాలకుగాను 1034 బ్యాలెట్ యూనిట్లు, 774 కంట్రోల్ యూనిట్లు, 841 వీవీ ప్యాట్‌లు రాగా వీటిలో మంచిర్యాల నియోజకవ ర్గంలో 273 పోలింగ్ కేంద్రాలు ఉండ డగా, 388 బ్యాలెట్ యూనిట్లు, 302 కంట్రోల్ యూనిట్లు, 315 వీవీ ప్యాట్‌లు కేటాయించడం జరిగిందని తెలిపారు. చెన్నూర్ నియోజక వర్గం లో 220 పోలీంగ్ కేంద్రాలకు 312 బ్యాలెట్ యూనిట్లు, 343 కంట్రోల్ యూనిట్లు, 255 వీవీ ప్యాట్‌లు కేటాయించడం జరిగిందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 206 పోలింగ్ కేం ద్రాలుండగా, 292 బ్యాలెట్ యూని ట్లు, 227 కంట్రోల్ యూనిట్లు, 239 వీవీ ప్యాట్‌లు కేటాయించారు. అదన ంగా అత్యవసర సమయంలో వినియోగించుటకు 42 బ్యాలెట్ యూని ట్లు, 2 కంట్రోల్ యూనిట్లు, 32 వీవీ ప్యాట్‌లు రిజర్వ్‌డ్‌లో ఉంచడం జరిగి ందన్నారు. 3 నియోజకవర్గాలకు బా యలెట్ యూనిట్లు, కంట్రోల్ యూ నిట్లు, వీవీ ప్యాట్‌లను రాజకీయ సమాక్షంలోనే ఎలక్ట్రానిక్ యంత్రాల వరుస సంఖ్యల ప్రకారం పవర్ పా యింట్ ప్రజేంటేషన్ ద్వారా నియోజ కవర్గాల వారీగా కేటాయించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జి ల్లా జాయింట్ కలెక్టర్ వై.సురేందర్ రావు, ఎన్నికల నోడల్‌అధికారి శ్యా మలాదేవీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.