అదిలాబాద్

ఉపాధి కల్పించకుంటే అడ్టుకుంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాసిపిట, నవంబర్ 13: కాసిపేట 2 గనిలో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలలో యువకులకు ఉపాధి కల్పించాలని, లేకుంటే గనిని అడ్డుకుంటామని కోమటిచేను యువకులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి అధికారులు మూడేళ్ళు కంట్రాక్టు పనులు చేయించుకుని ప్రస్థుతం పని లేదని పంపిస్తున్నారని తమ భూములు ఉంటే మేము ఉపాధి పొందే వారమని, తమకు సింగరేణి వారు ఉపాధి కల్పించాలని యువకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ గత మూడేళ్ళ కితం కోమటిచేను, పల్లంగూడ శివారులో కాసిపేట 2 గనికి అవసరమైన భూములను సింగరేణి వారు తీసుకున్నారని, ఆ సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి మూడు సంవత్సరాలు పని చేయించుకుని ప్రస్తుతం పనులు లేవని పంపించారని సింగరేణి అధికారులు ఇచ్చిన మాట ప్రకారంగా ఉపాధి కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి గని వల్ల తమ కుటుంబాలు బాగు పడుతాయని, ఉపాధి లభిస్తుందని నమ్మి తమ భూమలును ఇచ్చామని పేర్కొన్నారు. గనికి అవసరమైన భూమి 78 ఎకరాలని చెప్పిన అధికారులు 92 ఎకరాలు తీసుకున్నారని, వాటిలో భూతగాదాలు ఉన్న గని వస్తుందని భవిష్యత్తు బాగుపడుతుందని ఆశ పడ్డామన్నారు.