అదిలాబాద్

ప్రజలే చరిత్ర నిర్మాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, నవంబర్ 18: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలే చరిత్ర నిర్మాతలని సిపిఐ నేత, మహాకూటమి సిపిఐ అభ్యర్థి గుండా మల్లేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ అభ్యర్థిగా మాజీ మంత్రి గడ్డం వినోద్ వస్తున్నాడని వార్తలు ఆవాస్తవమ న్నారు. టి ఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఈ ఎన్నికలలో ఓడించడానికి కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజేఎస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. మహా కూటమి నేతృత్వంలోసిపిఐ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని నేడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో సిపిఐ అత్యధిక మేజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ పార్టీపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొనిఉందన్నారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నుండి బీ ఫారం రాక అన్ని పార్టీ ఆఫీసులు తిరిగి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజలకు గుర్తు లేని నాన్‌లోకల్ వ్యక్తి మాజీ మంత్రి గడ్డం వినోద్ బెల్లంపల్లిలో పోటీచేయడం హాస్యాస్పదమన్నారు. వినోద్ దగ్గర ధనం ఉంటే మా దగ్గర ప్రజా బలం ఉందని ప్రజలే చరిత్ర నిర్మాతలు అని గుర్తుచేశారు. టిఆర్‌ఎస్ పార్టీని మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజల సమస్యల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీ ని అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో సీనియర్ నాయకు లు చిప్ప నర్సయ్య, మిట్టపల్లి వెంకటస్వామి, పట్టణ కార్యదర్శి మంతెన మల్లేష్, మహిళ నాయకురాలు బొల్లం పూర్ణిమ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు ఎన్నికల పరిశీలకుల రాక
* జిల్లా ఉపఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావు
మంచిర్యాల, నవంబర్ 18: అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి నియోజక వర్గాలకు సాధారణ పరిశీలకులుగా జీహెచ్.ఖాన్ ఐఏఎస్, చెన్నూర్ నియోజక వర్గానికి సాధారణ పరిశీలకులుగా ఆర్ హాలానీ ఐఏఎస్ నియమించడం జరిగిందని వీరు ఆదివారం రాత్రి మంచిర్యాల కు చేరుకుంటారని జిల్లా ఉపఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు తెలిపారు.