అదిలాబాద్

అధికారంలోకి వస్తే ఏజెన్సీలో గిరిజనేతరులకు పహాణీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 18: కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు సాగుచేసుకుంటున్న గిరిజనేతరులకు పహాణీలు, హక్కుపత్రాలు అందించి భూసమస్య కు పరిష్కారం చూపుతామని కాం గ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్ మండల కేంద్రంలో ఆదివార ం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భట్టి విక్రమార్కతోపాటు ఆ పార్టీ ప్రచార తార విజయశాంతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. తొ లుత మార్లవాయి గ్రామానికి హెలిపా యడ్ ద్వారా చేరుకొని ఆ గ్రామంలోని హెమన్‌డార్ప్ దంపతులు, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి నేరుగా జైనూర్ బహిరంగ సభకు చేరుకున్నారు. ఈ సంధర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏజెన్సీ లో గిరిజనులు, గిరిజనేతరుల మద్య భూవివాద సమస్యలు తెరపైకి తెచ్చిం ది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఏజెన్సీలోని గిరిజనులతో పాటు గిరిజనేతరులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్దిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఏళ్ళ తరబడి గిరిజనేతరులు సాగుచేస్తున్న భూములకు పహానీలు పంపిణీ చేసి పంట రుణాలు పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. మహాకూటమి అభ్యర్థులను ఓడించేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చా రు. ఆ పార్టీ ప్రచార తార సినీ నటి విజయశాంతి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంత పాలన సాగించారని, కుటు ంబంలోని నలుగురు మాత్రమే లబ్దిపొందారన్నారు. గిరిజన ప్రాంతం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమవుతుందని, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి సోయం బాపురావు, ఆసిఫాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆహ్మాద్, ఆ పార్టీ నాయకులు బాలేష్ గౌడ్, అబుదలీప్, జైనూర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపిపి విమల ప్రకాష్, మాజీ వైస్ ఎంపిపి రషీద్, నాయకులు ఆత్రం శంకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.