అదిలాబాద్

సకల జనుల సంక్షేమం సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్‌టౌన్, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలోని సకల జనుల సంక్షేమాభివృద్ది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్ ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, అపద్దర్మ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సంధర్భంగా తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ముద్రించిన కరపత్రాలను అందజేస్తూ అభివృద్దిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన టీఆర్‌ఎస్ పార్టీని మరోసారి ఆదరించి కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు సిసి ఐ పునరుద్దరణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తుందన్నారు. 2016 సంవత్సరంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరైందని, ఈ విషయమై బిజెపి నాయకులు సంబరాలు సైతం జరుపుకున్నారని, ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల వాటాతో మంజూరైన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ సర్వేల పేరిట కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజానికం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, ఆసరా, కెసి ఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు పేద కుటుంబాల్లో వెలుగులు నింపాయన్నారు. మరోసారి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించి అభివృద్దికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా గంట సురేష్, గంట జీవన్ అధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కాళ్ళ విఠ్ఠల్, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.