అదిలాబాద్

* సైన్స్‌ఫెయిర్‌లో కలెక్టర్ దివ్య దేవరాజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, నవంబర్ 19: ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థు ల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయునిపై ఉందని కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. సోమవారం ఇచ్చోడ జి ల్లాపరిషత్ సెకండరీ పాఠశాలలో జరిగిన 46వ జవహర్‌లాల్‌నెహ్రూ సైన్స్ వైజ్ఞానిక సదస్సును జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం కలెక్ట ర్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలందరికి కంప్యూటర్ విద్యతోపాటు సైన్స్ టెక్నాలజీకి సం బంధించిన వైజ్ఞానిక ప్రదర్శనలపై ఆ సక్తి పెంచేలా కృషిచేస్తున్నామని, ఇం దులో భాగంగానే ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే వి ద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇచ్చోడ లో రెండు రోజులపాటు జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానికి సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు తమ మే ధాశక్తిని పెంచుకొని వినూత్న రీతిలో ప్రదర్శనలు చేపట్టి తమ సత్తాను చా టుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలో నే రాష్టస్థ్రాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇచ్చోడలో జరిగే సైన్స్‌ఫెయిర్‌లో అ త్యుత్తమ ప్రదర్శనలు గావించి గెలుపొందినవారికి రాష్టస్థ్రాయిలో నిర్వహించే పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. ఈ వైజ్ఞానిక సదస్సుకు జిల్లాలోని ఆయా మండలాల నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థు లు పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ రూపాల్లో రూపొందించిన ప్రదర్శన లు అబ్బురపర్చాయి. కలెక్టర్ ఆసక్తిగా తిలకిస్తూ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల కృషిని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి, ఐటిడిఏ డిడి చందన, స్థానిక మండల విద్యాధికారి రాథోడ్ ఉదయ్‌రావు, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ప్రకాష్, ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.