అదిలాబాద్

నిర్మల్ జిల్లాలో 80.15 శాతం పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 7: శాసనసభ సాధారణ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా పరిధిలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలో 6 లక్షల 21 వేల 456 మంది ఓటర్లుండగా వీరికోసం మొత్తం 757 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. ఆయా పోలింగ్‌స్టేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 80.15శాతం పోలింగ్ నమోదైంది. సెగ్మెంట్ల వారీగా చూస్తే నిర్మల్ నియోజకవర్గంలో 79.13శాతం పోలింగ్ నమోదుకాగా మొత్తం 1,71,540మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 76,625 మంది, మహిళలు 94,914 మంది ఉన్నారు. ముధోల్‌లో 82.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 1,78,949 ఓట్లు పోల్‌కాగా వీరిలో పురుషులు 87,885, మహిళలు 91,092 మంది ఉన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 78.42శాతం పోలింగ్ నమోదుకాగా మొత్తం 1,47,353 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలం తాటిగూడ గ్రామంలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయని నిరసనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతత చోటుచేసుకుంది. అలాగే ఖానాపూర్ పట్టణంలో సైతం పలువురు తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు స్పందించి వెంటనే వారిని చెదరగొట్టారు. ఇదిలా ఉంటే జిల్లాలోని చాలాచోట్ల ఓటింగ్ ప్రారంభంకాగానే ఈవీఎంలు మొరాయించడంతో వాటిని మార్చడం వల్ల ఓటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. నిర్మల్‌లోని బంగల్‌పేట్ పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటర్లు ఓటు వేసేందుకు బారులుతీరడంతో వారందరికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులతోపాటు పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

సమస్యత్మక ప్రాంతాలలో భారీ పోలింగ్
బెజ్జూర్, డిసెంబర్ 7: బెజ్జూర్, పెంచికల్ పేట మండలాల్లో శుక్రవారం నిర్వహించిన శాసనసభ ఎన్నికలలో భారీ పోలీంగ్ నమోదైంది. బెజ్జూర్ మండలంలోని 25 పోలీంగ్ కేంద్రాలలో 18,971 ఓట్లు ఉండగా 17,937 ఓట్లు పోలు అయ్యాయి. పెంచికల్ పేట మండలంలో 16 పోలీంగ్ కేంద్రాలలో 10,706 ఓటర్లు ఉండగా 10,024 ఓట్లు పోలు అయ్యాయి. కుమ్రంభీం జిల్లాలోని పెంచికల్ పేట , బెజ్జూర్, మారుమూల గ్రామాలలో పోలీంగ్ భారీగా జరిగింది. బెజ్జూర్ మండలంలో 94.74 శాతం కాగా పెంచికల్ పేట మండలంలో 93.67 శాతం నమోదు అయింది. పెంచికల్‌పేట మండలంలోని మారుమూల కమ్మర్గాం, మొర్లిగూడెం గ్రామాలలో మావోయిస్టుల ఇలకాలో భారీగా పోలీంగ్ నమోదు అయింది. కమ్మర్గాం గ్రామంలో 630 ఓట్లకు గాను 602, మొర్లిగూడెం గ్రామంలో 589ఓట్లకుగాను 544ఓట్లు పోలయ్యాయి. ఒకప్పుడు మావోయిస్టు ఇలకాలో భారీ పోలీంగ్ నమోదు కావడం గమనార్హం. సమస్యత్మక గ్రామాలలో భారీ పోలీంగ్ జరిగింది. పోలింగ్‌కు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.