అదిలాబాద్

ఆ నియోజకవర్గాల గెలుపులో సీనియర్లే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, డిసెంబర్ 14: ఓటమి తప్పదని భావించిన ఆ నియోజకవర్గాల్లో అధికార పార్టీ అనూహ్య విజయం సాధించడం వెనక సీనియర్ నేతలు పోషించిన పాత్ర ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో తమకున్న అపార అనుభవాన్ని రంగరించి ప్రత్యర్థుల వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్‌పెడుతూ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో ఆ నాయకులది అందెవేసిన చెయ్యి. ఇదే అనుభవం నిన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఎంతో ఉపయోగ పడింది. ఓటమి తప్పదనుకున్న అభ్యర్థులు సైతం గెలుపొందేందుకు దోహద పడింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన సమయంలో ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్, బెల్లంపల్లి, మంచిర్యాల స్థానాలను టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లకే కట్టబెట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గమైన చెన్నూర్ నుండి పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్‌ను బరిలో దించింది. అయితే ప్రజాకూటమి తరపున ఈ నియోజకవర్గాల నుండి బలమైన ప్రత్యర్థులు పోటీలో ఉన్న కారణంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం అంత సులువుకాదనే వాదనలు మొదట వినిపించాయి. ఈ నియోజకవర్గాల గెలుపుబాధ్యతలను ముఖ్యమంత్రి సీనియర్లకు అప్పగించారు. ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గమైన ఖానాపూర్, ఎస్పీ నియోజక వర్గం బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీని ముందుండి నడిపించే బాధ్యత భుజాలపై వేసుకున్న కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి మరోసారి తన రాజకీయ చతురతకు సానపెట్టారు. నిజానికి ఖానాపూర్‌లో ప్రజాకూటమి తరపున మాజీ ఎంపి రాథోడ్ రమేష్, బెల్లంపల్లిలో బీఎస్పీ అభ్యర్థిగా జి. వినోద్ పోటీలో ఉండడంతో ఓ దశలో అధికార పార్టీ గెలుపుపై అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం వేణు ప్రత్యేక వ్యూహాలు పన్నుతూ వచ్చాడు. తన రాజకీయ ప్రత్యర్థైన రాథోడ్‌కు చెక్‌పెట్టడం కోసం ఖానాపూర్‌లోనే మకాంవేసిన చారి సామ,్ధన, బేదదండోపాయాలు అవలంభించినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లిలో కష్టాల్లో ఉన్న దుర్గం చిన్నయ్యను మరోసారి గట్టెక్కించడంకోసం ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావుతోకలిసి చారి చేసిన వ్యూహా లు ఫలించాయి. బెల్లంపల్లి ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన పలువురు నేతలను సస్పెండ్ చేశాడు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రత్యర్థుల ఓటు బ్యాంకును టీఆర్‌ఎస్ వైపునకు మల్లించడంలో ఈ సీనియర్ నేత రాజకీయ అనుభవం ఉపయోగపడిందని చెప్పుకుంటున్నారు. ఖానాపూర్‌లో ఆదివాసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చారి వేసిన ఎత్తుగడ సక్సెస్ అయ్యింది. మొదటి నుండి తనకున్న కేడర్‌ను చారి ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా తూర్పు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గమైన చెన్నూర్, జనరల్ నియోజకవర్గమైన మంచిర్యాలల్లో టీఆర్‌ఎస్ విజయంలోనూ సీనియర్ల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతికూల పరిణామాల మధ్య చెన్నూర్ బరిలో దిగిన స్థానికేతరుడు బాల్క సుమన్ ప్రజాకూటమి అభ్యర్థి నేత వెంకటేష్ నుండి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. జనరల్ నియోజకవర్గమైన మంచిర్యాలలోనూ అధికార టీఆర్‌ఎస్‌కు దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. మంచిర్యాల పార్టీ జిల్లా ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావు, స్థానికుడైన ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లు తెరాస అభ్యర్థి సుమన్ గెలుపుకోసం పన్నిన వ్యూహాలు ఫలించాయి. జనరల్ నియోజకవర్గం మంచిర్యాలలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ-నువ్వా నేనా అన్నట్లు సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్‌రావు చేతిలో పరాభవం తప్పదనుకున్న టీఆర్‌ఎస్‌ను అరవింద్‌రెడ్డి గట్టెక్కించారనే చెప్పవచ్చు. మొదటి నుండి ప్రేంసాగర్ వైపున ఉన్న సింగరేణి కార్మికులు, గ్రామీణుల ఓటర్లను టీఆర్‌ఎస్ వైపునకు తిప్పుకోవడంలో అరవింద్ రెడ్డితోపాటు సీనియర్ నేతలు ఎమ్మెల్సీ పురాణం, ఇన్‌చార్జి అరిగెల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఈ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడంలో సీనియర్ నేతలు తెర వెనుక తమదైన పాత్ర పోషించారు. ఈ క్రమంలో పార్టీ గెలుపుకోసం పనిచేసిన నాయకులకు అధిష్టానం కీలక పదవులు కట్టబెట్టవచ్చనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం నిర్ణయానికి కట్టుబడి మథోల్‌తోపాటు, పలు నియోజకవర్గాల్లో పార్టీని విజయపథంలో నడిపించిన వేణుగోపాలాచారికి కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి సైతం రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం.

కేటీఆర్‌కు అల్లోల అభినందనలు
నిర్మల్, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌కు నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో యువనేత కేటీఆర్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లోల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను కేటీఆర్ సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందారని, వర్కింగ్ ప్రసిడెంట్‌గా కూడా అందరిని మెప్పించగల సమర్థుడని కొనియాడారు. జీహెచ్ ఎంసి, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

లారీ యజమానులపై చర్య తీసుకోండి
* సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి
మంచిర్యాల, డిసెంబర్ 14: మంచిర్యాల జిల్లా పరిధిలోని బొగ్గు, ఇసుక రవాణా చేస్తున్న లారీ యజమానులు తమ లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కోల్ బెల్ట్ లారీ యజమానులు, అసోసియేషన్ వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సిపి ఎం జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. బొగ్గు, ఇసుక రవాణా చేస్తున్న లారీల వల్లన అనేక మంది మృత్యువాత పడుతున్నారని, పలువురు గాయాల పాలు కావడం జరుగుతుందని, మూగ జీవుల మరణాలు లెక్క లేకుండా పోతున్నాయని అతి వేగంగా లారీలను నడిపిస్తుండటంతో పాటు కనీసం, క్లీనర్‌లను కూడా పెట్టుకోవడం లేదని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఓవర్ లోడ్‌తో బొగ్గు, ఇసుక రవాణా చేయడంతో కోల్ బెల్ట్ ప్రాంతంలోని రోడ్లన్ని గుంతలు పడ్డాయని తెలిపారు. నిబంధనలు పాటించని లారీ యజమానులపై ఆర్టీఏ, పోలీస్ శాఖల వారు జోక్యం చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.