అదిలాబాద్

సిసిఐ పరిశ్రమను పునరుద్ధరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 12: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం చేయూతనివ్వాలని, పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా సమస్యలపై ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు స్థానిక ఎంపి గెడం నగేష్‌తో కలిసి ముందుగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంతగితేతో జిల్లా సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థ పరిధిలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ 1998లో ఉత్పత్తి నిలిచిపోయి మూతపడిందని, దీంతో సుమారు 5వేల కుటుంబాలు ఉపాధి కోల్పోవల్సి వచ్చిందని మంత్రి రామన్న ఆనంత్‌గిత్తెకు వివరించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఇదే సమస్యపై కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా ఇప్పటివరకు స్పందన రాకపోవడంతో మరోసారి భేటీ కావాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్‌లో నిరుపేద కుటుంబాలకు జీవనాధారమైన సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, ఇందుకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అందిస్తామని మంత్రులు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఆనంత్‌గిత్తె వచ్చే జూన్ నెలలో హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఉన్నతస్థాయి అధికారులతో సిసిఐ పునరుద్దరణపై సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు, సిమెంట్ పరిశ్రమ పునరుద్దరణకు కేంద్రం సానుకూలంగా ఉందని హామీ ఇచ్చినట్లు మంత్రి జోగురామన్న తెలిపారు. కాగా సిసి ఐ సిమెంట్ పరిశ్రమ మూత పడడానికి గల కారణాలను, ప్రస్తుత పరిస్థితులను జిల్లా మంత్రులు కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాత్‌ను జిల్లా మంత్రులు కలిసి నిర్మల్‌లో కేంద్రీయ ఉన్నత విద్యాలయం ఏర్పాటుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే 13 బిసి సంక్షేమ వసతి గృహాలకు కేంద్రం తమ వాటా కింద రూ. 30 కోట్ల నిధులు కేటాయించాలని కోరినట్లు జోగురామన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందస్తు ధృవీకరణ పత్రాలు అందిన వెంటనే నిధులు మంజూరి చేస్తామని హామీ ఇచ్చినట్లు రామన్న తెలిపారు. మిగితా జిల్లా సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసి నిధులు రాబట్టేలా, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, తొలి రోజు ఢిల్లీ పర్యటన విజయవంతమైందని మంత్రి రామన్న వివరించారు.