అదిలాబాద్

ఊరూరా నకిలీ విత్తనాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, మే 13: వ్యవసాయంలో అన్నదాతకు ఆది నుండే అన్ని ఆటంకాలు ఎదురవుతాయనడంలో అతిశయోక్తి కాదు.వాంకిడి మండలంలో ఇప్పటికే రెండు వర్షాలు కురవడంతో పత్తి రైతులు పత్తి విత్తనాలు, ఎరువులు సమకూర్చడంలో బిజిగా ఉన్నారు. తమకు కావలసిన పత్తి విత్తనాలు, ఎరువులు ఇప్పటి నుండే ఇండ్లలో చేరవేసుకొంటున్నారు. అయితే మార్కేట్‌లో ఎడాపెడా వచ్చిపడ్డ విత్తనాలను ఎంపిక చేయడంలో మండల పత్తి రైతులు తికమకలకు గురవడమేకాకుండా నకిలీ విత్తన వియక్రయదారుల వలలో పడి అధిక ధరలో వాటిని కొనుగోలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, మండలానికి చెందిన కొంత మంది వ్యాపారులతో చేతులు కలిపిన గుంటూర్, విజయవాడలకు చెందిన నకిలి విత్తనాల వ్యాపారులు మండలానికి నకిలి విత్తనాలను విరివిగా సరఫరా చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది వ్యాపారులు గత సంవత్సరానికి చెందిన విత్తనాలను సైతం రైతులకు అమ్ముతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు.మండలంలో గత సంవత్సరం అసలే కాపుకాయని విజయ్ కంపనికి చెందిన నకిలి విత్తనాలు ఈసారి కూడా మార్కెట్‌లో విజయవిహారం చేస్తున్నాయని తెలిసింది. ఒరిజినల్ విత్తనాలకంటే నకిలి విత్తనాలే జోరుగా రైతులకు అంటకడుతున్నారు.నకిలి విత్తనాలు కొనుగోలు చేసిన వారికి బిల్లులు కూడా లేకపోవడంతో
తిరిగి రైతులు ఎవరిని బాధ్యులుగా చేయడానికి కుదరకపోవచ్చనే విషయం కూడా రైతులు గమనించకుండా విత్తనాల కొనుగోలులో బిజిబిజిగా ఉన్నారు. అయితే నకిలీ విత్తనాలు మండలానికి రాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని,నకిలి విత్తనాలు మండలానికి రాకుండా చర్యలు తీసుకోవాలని కొంత మంది మండల రైతులు కోరుతున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు సైతం ఈ నకిలీ విత్తనాల వ్యవహారంపై దృష్టి సారించాలని మండల రైతులు కోరుతున్నారు.
ఎరువుల కోసం మహారాష్టక్రు పరుగులు
రాష్ట్రంలో అధిక ధరలు పలికే యూరియా,డిఏపి ఎరువులే తప్ప ఈ ప్రాంతంలో పత్తి పంటకు రైతులు అధికంగా వాడే 18:18 ఎరువు ఎక్కడ లభించకపోవడంతో మండల పత్తిరైతులు 18:18 ఎరువు కోసం పక్కనే గల మహారాష్టల్రకు తరలి వెళ్తున్నారు. ఇక్కడ ఎలాగు యూరియా కొరత ఉండడంతోపాటు డిఏపిని 1380 రూపాయలకు కొనుగోలు చేసే బదులు 580 రూపాయలకు 18:18ను తెచ్చుకొంటున్నారు. దీనికోసం మండల పత్తి రైతులు ఇప్పటి నుండే ప్రనాళికలు సిద్దం చేసి పెద్ద మొత్తంలో పంటకు సరిపడు ఎరువులను ముందుగానే తెచ్చుకొంటున్నారు. మన ప్రాంతంలో సైతం పత్తి రైతుకు తక్కువ ధరకు వచ్చి ఎంతో ఉపయోగపడే 18:18 ఎరువును జిల్లా అధికారులు తెప్పించి మండల వారిగా రైతులకు అందచేస్తే బాగుంటుందని వారంటున్నారు.