అదిలాబాద్

ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, మే 16: గిరిజన దర్బార్‌కు వచ్చే ఆర్జీలపై అధికిరులు నిర్లక్ష్యం వహించకుండా సత్వర పరిష్కారం కొరకు కృషి చేయాలని ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. గిరి దర్బార్‌లో భాగంగా సోమవారం ఆయన గిరిజనుల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సంధర్భంగా పివో మాట్లాడుతూ ప్రజాదర్బార్‌కు వచ్చే ఆర్జీల సమస్యలను పూర్తిస్థాయిలో పరిశీలించి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత వారంలో గిరిజన దర్బార్‌కు వచ్చిన ఆర్జీలు ఏమేరకు పరిష్కరించారో శాఖల వారీగా సమీక్షించారు. అనంతరం సిర్పూర్‌యు మండలం నెట్పూర్ గ్రామానికి చెందిన అత్రం జశ్వంత్‌రావు తన వ్యవసాయ భూమిలో బోరు బావి మంజూరి చేయాలని, నేరడిగొంగ మండలం సించోరి గ్రామానికి చెందిన కుడ్మెత శంకర్ తన కుటుంబ పోషణకు మేకల లోను మంజూరు చేయాలని ఆర్జీ రూపంలో విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వాంకిడి మండలం కొలాం గూడకు చెందిన టేకం రాజు ఎడ్ల జతల కోసం, ఆదిలాబాద్ మండలం అంకాపూర్‌కు చెందిన గోవింద్‌రావు కిరాణ దుకాణం కోసం ఆర్థిక సాయం, తాంసి మండలం అంతర్గాంకు చెందిన సురేష్ ట్రాక్టర్ మంజూరు చేయాలని ఆర్జీలో కోరారు. వీరితో పాటు ఇంద్రవెల్లి మండలం దన్నోర గోండువాడకు చెందిన పలువురు గిరిజనులు తమ గ్రామంలో మంచినీటి ట్యాంకు నిర్మించాలని, బోరువేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆర్జీలో కోరారు. మరో 400 మంది గిరిజనులు వివిధ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు.