అదిలాబాద్

పకడ్బందీగా ‘టెట్’ నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మే 17: ఈనెల 22న నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెట్2016 పరీక్ష నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టెట్ పరీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రణాళికబద్దంగా నిర్వహించాలన్నారు. టెట్ పరీక్ష నిర్వహణకు నియమించిన చీఫ్ సూపరీటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, డిపార్టుమెంట్ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని పరీక్షను విజయవంతంగా నిర్వర్తించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యశాఖతో పాటు ఇతర శాఖలకు చెందిన వారిని కూడా టెట్ పరీక్షా నిర్వహణకు నియమించడం జరిగిందన్నారు. అధికారులు పరీక్ష నిర్వహణకు సంబంధించిన సూచనలు జాగ్రత్తగా చదువుకొని నిబంధనల మేరకు పరీక్షను నిర్వహించాలన్నారు. జిల్లా విద్యాధికారి కె.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పరీక్ష సక్రమంగా జరిగేలా అధికారులు చూడాలన్నారు.
పరీక్ష కేంద్రాలకు సరిపోయేంత ప్రశ్నపత్రాలు, మెటిరియల్ వచ్చాయో లేవో సరిచూసుకోవాలని, జిల్లాలో 15,575 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాస్తున్నారని అన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు జరిగే పేపర్1కు 5589 మంది, 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పేపర్2కు 9986 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 8 మంది రూట్ ఆఫీసర్లు, 53 చీఫ్ సూపరింటెండెంట్లు, 53 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 583 ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని తెలిపారు. టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదన్నారు. అభ్యర్థి వెంట ఒక పాస్‌పోర్టు ఫోటోను తీసుకవచ్చి హాల్‌టికెట్‌పై ఇన్విజిలేటర్ సమక్షంలో అతికించాలని అన్నారు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను వాడాలని, సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష సెంటర్‌కు తీసుకరావద్దని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.

35 మద్యం కార్టన్లు పట్టివేత
సిర్పూర్(టి), మే 17: కాగజ్‌నగర్ నుంచి మహారాష్టక్రు ఆటోలో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మద్యం 35 కాటన్లలో తరలిస్తుండగా, సిర్పూర్‌టి ఎస్సై ప్రవీణ్ కుమార్ హుడ్కిలి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఆటోలో మద్యం పట్టుబడింది. గత కొన్ని రోజులుగా మహారాష్టక్రు అక్రమ మద్యం జోరుగా రవాణా అవుతుందన్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టగా హుడ్కిలి సమీపంలో ఆటోలో అక్రమ మద్యం పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.