అదిలాబాద్

చెరువుల్లో నాణ్యత విస్మరించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 19: రైతుల బీడు భూములకు సాగునీరందించి భూగర్భజలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకు తూట్లు పొడిస్తే సహించేది లేదని అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న హెచ్చరించారు. గురువారం సాయంత్రం మావల గ్రామపంచాయతీ పరిధిలోని మావల పాత చెరువు, రెండవ దశలో చేపట్టిన కొత్త చెరువు పనులను మంత్రి జోగురామన్న ఆకస్మికంగా సందర్శించి, అక్కడి పనుల తీరుపై ఆరా తీశారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ఇటీవలే భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లాలో పలు చెరువు పునరుద్దరణ పనులను, సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి, ప్రజా ప్రతినిధుల బాధ్యతలను గుర్తుచేశారని, ఈ పనుల్లో అక్రమాలు జరిగితే బాధ్యులెవరైనా సరే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. భూగర్భజలాలు అడుగంటి పోయి తాగునీటికి అవస్థలు పడుతున్న నేపథ్యంలో కాకతీయ మిషన్ చెరువుల పూడికతీత, కొత్త చెరువుల నిర్మాణంతో సాగునీటి ఆయకట్టు గణనీయంగా పెరగనుందని అన్నారు. ఇందుకు ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా సామాజిక బాధ్యతగా తమ పరిధిలో గల చెరువులు, సాగునీటి పథకాలను పరిశీలిస్తూ అభివృద్దికి కృషి చేయాలని అన్నారు. ఎమైనా లోపాలు, సమస్యలుంటే తన దృష్టికి తీసుకరావాలని మంత్రి సంబంధిత డిఈ ప్రతాఫ్ సింగ్‌కు సూచించారు. నాణ్యత ప్రమాణాలను పాటించకుండా అక్రమంగా బిల్లులు కాజేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జడ్పీటీసీలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు కాకతీయ మిషన్ చెరువులను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ వివరాలు తనకు అందించాలని సూచించారు. జిల్లాలో మొదటి దశలో 95 శాతం పనులు గ్రౌండింగ్ పూరె్తై పనులు చురుకుగా సాగుతున్నాయని, అటవీ శాఖ పరిధిలో ఎవైనా అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని మంత్రి రామన్న సూచించారు. ఆదిలాబాద్ పట్టణానికి తాగునీరందించే పురాతన కాలం నాటి పాత మావల చెరువును పునరుద్దరించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వీటి పూడికతీత పనులను మున్సిపాలిటీ అధికారులు పరిశీలించాలని అన్నారు. మంత్రి జోగురామన్న వెంట డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, జడ్పీటీసీ అశోక్, మావల సర్పంచ్ రఘుపతి, ఇరిగేషన్ డిఈ ప్రతాఫ్ సింగ్ తదితరులు ఉన్నారు.