అదిలాబాద్

ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 19: ఈనెల 24 నుండి 29 వరకు జరిగే ఇంటర్మీడియేట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు గావించారు. రోజుకు రెండు విడతలుగా జరిగే సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 22,991 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈమేరకు గురువారం పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ జగన్మోహన్ సమీక్షించారు. ఈ సంధర్భంగా పరీక్షల నిర్వహణపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. పరీక్షలలో ఏలాంటి చూచిరాతలకు, లోటుపాట్లకు తావులేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్దవహించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలం దృష్ట్యా అన్ని పరీక్షల కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షలకు సకాలంలో హాజరయ్యే విధంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను, పరీక్షల నిర్వహణ సమయంలో పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్‌సెంటర్లను మూసి వేయాలని, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్‌ఐఓబి నాగేందర్ మాట్లాడుతూ ఇంటర్మీడియేట్ సప్లమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేయడం జరిగిందన్నారు. మొదటి సంవత్సరంలో 13630 జనరల్ విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 891 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 7716 రెగ్యులర్ విద్యార్థులు, ఓకేషనల్‌లో 754 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని అన్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదిలాబాద్‌లో 5 కేంద్రాలు, ముథోల్, కాసిపేట, మందమర్రి, సిర్పూర్‌టి, కౌటాల, చెన్నూర్, తిర్యాణి, ఆసిఫాబాద్, బోథ్, మామడ, ఖానాపూర్, కడెం, జన్నారం, దండేపల్లి, తాంసి, ఇంద్రవెల్లి, రెబ్బెనలలో ఒక కేంద్రం చొప్పున ఏర్పాటు చేయగా, భైంసా, సిర్పూర్ కాగజ్‌నగర్, లక్సెటిపేటలో 2 కేంద్రాల చొప్పున, బెల్లంపల్లిలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పనసారెడ్డి, ముథోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యం.డి యూసుపుద్దీన్, నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.దస్రూ, ఆదిలాబాద్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జె.గణేష్‌కుమార్, డాక్టర్ సుంకం, ఎస్‌బిఐ ఎస్సై కరీమ్, ఆర్టీసి అధికారి శరథ్‌ప్రసాద్, పోస్టల్ అధికారి ఎస్.విజయ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.