అదిలాబాద్

సరిహద్దుల్లో పోలీసు భారీ కూంబింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూరు, మే 19: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా తెలంగాణలోని బెజ్జూరు, దహెగాం మండలాల్లోని ప్రాణహిత నదీ పరిసర ప్రాంతాలైన గూడెం, సోమిని, కమ్మర్‌గాం, దహెగాం మండలంలోని ఖర్జి, మొట్లగూడ, రాంపూర్ తదితర ప్రాంతాల్లో , మహారాష్టల్రోని చేవేల మర్రి, వెంకటాపూర్, చిన్నవత్రా తదితర గ్రామాల్లో మహారాష్ట్ర పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో మావోల కదలికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ, మహారాష్టల్ర ఉమ్మడి పోలీసులు ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ లోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నదీ పరిసర ప్రాంతాలను ఉన్నతాధికారులు సందర్శించారు. తెలంగాణ పోలీసులు హెలిక్యాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రాణహిత పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజన గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి.