అదిలాబాద్

బహిష్కరణకు గురైన సర్పంచ్ కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మే 19: మంచిర్యాల మండలంలోని పెద్దంపేట గ్రామ సర్పంచ్ దుర్గం లక్ష్మిని కుల బహిష్కరణ చేయడంతో సంచలనం రేపింది. ఓ చిన్న ఘటన ఏకంగా ప్రజా ప్రతినిధిని కుల బహిష్కరణ చేయడం కొసమెరుపు. సర్పంచ్ దుర్గం లక్ష్మి తన తోడికోడలు అయిన దుర్గం భాగ్య లక్ష్మికి రెండేళ్ల క్రితం జరిగిన చిన్న వివాదం ఈ కుల బహిష్కరణకు కారణమైంది. అంబేద్కర్ జయంతి సందర్బంగా తోడికోడలు ఇంటి ముందు ఉన్న అంబేద్కర్ గద్దె నిర్మాణం వారి మద్య గొడవకు దారి తీసింది. ఇరువురి గొడవ కుల పెద్దలతో పాటు పోలీసు స్టేషన్ వరకు వచ్చింది. కుల సంఘాలు భాగ్యలక్ష్మికి రూ.1000 జరిమానా విధించారు. వీరి మద్య వివాదం మరోసారి చోటు చేసుకుంది. దీంతో సర్పంచ్ లక్ష్మి గత నెల 26న పోలీసు స్టేషన్‌కు వెళ్లగా కులం మాట దిక్కరించినందుకు సర్పంచ్ లక్ష్మికి రూ.2500 జరిమానా కట్టాలని తీర్మాణం చేశారు. అదే సమయంలో గత నెల 27న గ్రామంలోనే తమ కులానికి చెందిన కుటుంబం సర్పంచ్ కుటుంబాన్ని వివాహానికి ఆహ్వానించింది. దీంతో సమాచారం తెలుసుకున్న కుల సంఘం ఆ కుటుంబాన్ని సర్పంచ్ ఇంటికి పంపించి పెళ్లికి రావద్దని వస్తే కుల సంఘం నుంచి ఎవరూ రారని, ఎలాంటి సహాకారం ఉండదని సర్పంచ్ కుటుంబానికి చెప్పారు. కుల బహిష్కరణతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ కుటుంబానికి కుల పెద్దలు హెచ్చరించారని సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచ్ కుటుంబంలో జరిగే ఏ శుభకార్యాలతో పాటు ఇతర అవసరాలకు వెళ్లినా ఆ కుటుంబానికి రూ.5వేలు జరిమానా విధించడంతో పాటు కుల బహిష్కరణ ఉంటుందని గ్రామంలోని సంబంధిత కులస్తులకు స్పష్టం చేశారు. కుల సంఘంలో ఓ మహిళా సర్పంచ్ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడం ఆలస్యంగా వెలుగు చూసింది. నేటి ఆధునిక సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగడం శోచనీయమని పలువురు అంటున్నారు. కుల బహిష్కరణ విషయంపై ఇతర కులాల పెద్దలకు చెప్పినా ఎలాంటి న్యాయం జరుగకపోవడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు ఏ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఎదుగుదల చూసి ఓర్వలేక బహిష్కరణ...: సర్పంచ్ దుర్గం లక్ష్మి
గ్రామం అభివృద్దిలో ముందుకు వెళ్లడంతో పాటు రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుల బహిష్కరణ వేటు వేశారని సర్పంచ్ లక్ష్మి తెలిపారు. రాజకీయ కక్షలు, కుట్రలతో పాటు కొంత మంది ప్రజాప్రతినిధులు తమకు అన్యాయం చేసేలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ సర్పంచ్‌ను కూడా కాకపోవడం దీనికి కారణంగా చిన్న చిన్న వివాదాన్ని భూతద్దంలో చూస్తూ తమ కుటుంబాన్ని మానసికంగా వేదిస్తున్నారని ఏ ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కూడా తనకు ప్రజాప్రతినిధుల అండ గానీ, కుల సంఘాల నుంచి గానీ ఎలాంటి సహాకారం అందకపోవడం శోచనీయం.