అదిలాబాద్

వర్షంతో ఊపందుకున్న ఖరీఫ్ సాగు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 17: ఈసారి వర్షాలు అనుకూలిస్తాయనే ఆశతో ముందుగానే విత్తనాలు నాటిన రైతులకు తొలకరి జల్లులు రైతుల్లో కొత్త ఆశలకు జీవం పోశాయి. అయితే ముందస్తుగా రుతుపవనాల ప్రభావం ఉంటుందని భావించిన రైతులు జిల్లా వ్యాప్తంగా లక్షా 5వేల ఎకరాల్లో విత్తనాలు నాటి దిక్కులు చూస్తున్నారు. బోథ్, నిర్మల్, భైంసా డివిజన్‌లలో ఐదు రోజుల కిందట కురిసిన తొలకరి వర్షాలతో మురిసిపోయిన రైతులు తీరా మేఘాలు ముఖం చాటేయడంతో రైతులు అందోళన చెందాల్సి వచ్చింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కారుమబ్బులు కమ్ముకొని గంటసేపు వర్షం కురియడంతో ఆదిలాబాద్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదిలాబాద్, తాంసి, గుడిహత్నూర్ మండలాల్లో 2.5 సెం.మీటర్ల వర్షం కురియగా కాగజ్‌నగర్ ప్రాంతంలో కురిసిన మోస్తరు వర్షం రైతుల ఆశలకు ఊపిరి పోసింది. దీంతో ఖరీఫ్ పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఆదిలాబాద్ మండలంలోని జందాపూర్, యాపల్‌గూడ, అంకోలి, అనుకుంట, తంతోలి, పొచ్చర, తాంసి మండలంలోని పొన్నారి, కుచులాపూర్, ఖోడద్ తదితర గ్రామాల్లో శుక్రవారం కురిసిన తొలకరి వర్షాలకు పుడమితల్లి పులకించిపోయింది. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితులు ఎదురుకాగా ముందస్తుగా రుతు పవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తాయని ఆశతో ఆదిలాబాద్, బోథ్, ఉట్నూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లకు చెందిన రైతులు పత్తి, కందులు, సోయాబీన్ విత్తనాలువేసి తీవ్ర నిరాశకు గురయ్యారు. మరో రెండు రోజుల్లో వర్షాలు కురియకపోతే వేసిన విత్తనాలు భూమిలోనే మాడిపోయే పరిస్థితి దాపురించాయి. అక్కడక్కడ అడపాదడపా కురుస్తున్న వర్షాలు రైతుల్లోఆశలు చిగురింపజేస్తున్న నైరుతి రుతుపవనాలు ప్రవేశించి తొలకరి వర్షాలు కురిస్తేనే రైతులు కరవు పరిస్థితుల నుండి గట్టెక్కె అవకాశంఉంది. కొన్నిచోట్ల విత్తనాలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో తమ విత్తనాలను కాపాడుకునేందుకు చెంబులతో నీళ్ళుపోస్తూ వరుణుడిపై భారం పెంచుకున్నారు. జిల్లాలో సాధారణ పంట సాగు 5.70 లక్షల హెక్టార్లు కాగా, ఈసారి ఖరీఫ్‌లో 6 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పత్తికి ఈ ఏడాది మద్దతు ధర ఉండదని ప్రభుత్వం ముందుగానే ప్రచారం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించినప్పటికీ రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో పత్తినే జీవనాధారంగా మలుచుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 5వేల ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నట్లు అంచనా వేయగా రెండు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు తీపికబురు చెప్పడంతో రైతులు సాగుపై బిజీగా గడుపుతున్నారు. ఇంతవరకు విత్తనాలు వేయని రైతులు శుక్రవారం కురిసిన వర్షంతో విత్తనాలు నాటేందుకు సిద్దపడుతున్నారు. ఇప్పటి వరకు 82 మి.మీటర్ల వర్షపాతం ఈ సీజన్‌లో కురవాల్సి ఉండగా 65మి.మీటర్ల సగటు వర్షపాతం కురిసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఏజెన్సీలోని ఉట్నూరు, కెరమెరి, సిర్పూర్‌యు, జైనూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో విత్తనాలు వేసిన రైతులు వర్షాలులేక సుమారు రూ.2కోట్ల విలువైన విత్తనాలను కోల్పోవల్సి వచ్చింది. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఈఏడాది 3249కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నా సవాలక్ష కారణాలు చూపి రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా కరవు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఏడాది పంటరుణాల లక్ష్యంలో 70 శాతం కూడా రుణాలు అందించని బ్యాంకర్లు ఈసారి రుణ పంపిణీ లక్ష్యం పెంచినా ఎంత వరకు పంపిణీ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.