అదిలాబాద్

25న విటిడిఏలకు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూన్ 17: ఈనెల 25న విటిడిఏ (గ్రామ గిరిజన అభివృద్ధి సంఘాల)కు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పివో మాట్లాడుతూ ఏజెన్సీ వ్యాప్తంగా 25న విటిడిఏ ఎన్నికలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన విటిడిఏలకు 30వ తేదీన బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అదేవిధంగా ఎన్నికైన కొత్త కమిటీ సభ్యులకు జూలై 7వ తేదీన శిక్షణ ఇస్తామన్నారు. ఇక్రిషాట్ నుండి సేకరించిన హైబ్రీడ్ విత్తనాలను 2వేల మంది గిరిజన రైతులకు పిఆర్ డిపోల ద్వారా వాంకిడి మండలానికి 640 కిలోలు, కెరమెరి మండలానికి 700, తిర్యాణి మండలానికి 600 కిలోల కందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో కందులు రబీలో జొన్నలు, వి ఆర్‌డిపోల ద్వారా గిరిజన ప్రాంతాల రైతులకు సబ్సిడీ ద్వారా అందజేస్తామన్నారు. 165 క్వింటాళ్ల కంది విత్తనాలు, 62 క్వింటాళ్ల పెసరి విత్తనాలు, 95 క్వింటాళ్ల మినప విత్తనాలు గిరిజన ప్రాంత రైతులకు సరఫరా చేస్తున్నామన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచేందుకు ఏజెన్సీలోని పది మండలాల్లో కళాబృందాల ద్వారా పది రోజుల పాటు కళాజాత కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 6 గురుకుల బాలికల పాఠశాలలు మంజూరైనట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 103 గురుకుల పాఠశాలలు మంజూరు కాగా, ఉట్నూరు, ఐటిడిఏ పరిధిలో 6 మంజూరయ్యాయన్నారు. ఇందులో జైనూర్, తిర్యాణి, ఇంద్రవెల్లి, బోథ్, సిర్పూర్‌టి, భైంసా మండల కేంద్రాలకు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా విద్యార్థుల సంక్షేమం కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.