అదిలాబాద్

బాసరకు భక్తజన జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూన్ 17: తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రం భక్తజన జాతరగా మారింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం భక్తులకు శాపంగా మారింది. బాసర సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అమ్మవారి దర్శన క్యూలైన్‌లు బారులు తీరాయి. దర్శనానికి 2 గంటల సమయం పట్టడంతో భక్తులు క్యూలైన్‌లో ఇబ్బందులకు గురయ్యారు. వేసవి సెలవులు ముగిసిపోవడం పాఠశాలలు ప్రారంభం నేపథ్యంలో అమ్మవారి చెంత తమ చిన్నారులకు అక్షరస్వీకారాలు దిద్దించాలనే ఉద్దేశంతో ఉదయం నుండి భక్తులు క్యూలైన్‌లలో బారులు తీరారు. సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాస మండపాల్లో భక్తులు తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే అక్షరాభ్యాస పూజలను ఘనంగా నిర్వహింపచేశారు.
గోదావరి తీరం వద్ద కానరాని ఏర్పాట్లు... భక్తులకు ఇక్కట్లు....
ఆలయ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల గోదావరి తీరం వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు ఆలయ అధికారులు కల్పించకపోవడంతో భక్తులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి వద్ద జల్లు స్నానాలు ఆచరించడానికి తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన భక్తులకు నిరాశ తప్పలేదు. ఆలయ అధికారులు ఒక్కటే జల్లు స్నానాల షవర్ ఏర్పాటుచేయడంతో భక్తులు గంటల తరబడి వేచివుండే పరిస్థితులు నెలకొన్నాయి. గత్యంతరం లేక భక్తులు, చిన్నారులు నది గర్భంలో అక్కడక్కడ నిలిచివున్న గుంతలోని నీటితోనే పుణ్యస్నానాలు, పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ కోట్ల రూపాయల ఆదాయం ఉన్న బాసర ఆలయానికి గోదావరి తీరం వద్ద జల్లు స్నానాలకు మరో రెండు షవర్లు ఏర్పాటుచేయాల్సి ఉన్న ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు మురికి గుంటలలో నిలిచివున్న నీటితోనే పుణ్యస్నానాలు కానిస్తున్నారు. గత పుష్కరకాలంగా గోదావరి నది ఎడారిగా మారడం ఇదే ప్రథమం అని భక్తులు పేర్కొన్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని భక్తులు పేర్కొన్నారు. బాసర క్షేత్రానికి వేల సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికి ఆలయ ఉన్నతాధికారి స్థానికంగా ఉండకపోవడం విమర్శలకు తావిస్తోంది.