అదిలాబాద్

హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యనగర్, జూన్ 17: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేటట్లుగా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రయాణంలో భద్రతఎంతో అవసరమని కలెక్టర్ జగన్‌మోహన్ తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని రోడ్లు భవనాలశాఖ అతిథిగృహంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌తోకలిసి రోడ్డు భద్రత పాటించడంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలుచేశారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు కొనితెచ్చుకుని ప్రమాదం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేటట్లుగా చూడాలని లేనిచో అపరాధ రుసుము వసూలుచేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. టోల్‌ప్లాజాల వద్ద, ప్రధాన రహదారులపై సిసి కెమెరాలను వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు పెట్రోల్ పోయకుండా పెట్రోల్ పంపుల యజమానులకు ఆంక్షలు విధించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పాఠశాలల్లో, కళాశాలల్లో హెల్మెట్ వాడక ఆవశ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటిల్లో, పట్టణాల్లో సిసి కెమెరాలను ఏర్పాటుచేయాలన్నారు. ఎస్పీ విక్రమ్‌జిత్ సింగ్ దుగ్గల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డివొ శివలింగయ్య, రవాణాశాఖ డిప్యూటి కమీషనర్ సుధాకర్‌రెడ్డి, పుప్పాల శ్రీనివాస్, డి ఎస్పీ మనోహర్‌రెడ్డి, సి ఐలు జీవన్‌రెడ్డి, పురుషోత్తం, తహసిల్దార్‌లు రాజేశ్వర్, నారాయణ, రామస్వామి, స్రవంతి, శ్యాంసుందర్, ఎండి వాజిద్ అలి పాల్గొన్నారు.