అదిలాబాద్

పోలీసుల సంక్షేమానికి అన్ని విధాల కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, జూన్ 17: పోలీసుల సంక్షేమానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో బాధిత పోలీసు కానిస్టేబుల్ భార్య కె.రజితకు రూ.5 లక్షల 5వేల చెక్కును ఎస్పీ అందజేశారు. 2015 డిసెంబర్ 9న దహెగాం పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న యువ కానిస్టేబుల్ కుడికెల శ్రీనివాస్ (29) విధి నిర్వహణలో కరీంనగర్ నుండి దహెగాం పిఎస్‌కు వస్తుండగా ఎన్‌టిపిసి ఆటోనగర్‌కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ కానిస్టేబుల్ శ్రీనివాస్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలను దక్కించుకునే అవకాశం ఉండేదన్నారు. తమ అమూల్యమైన ప్రాణాలను నిర్లక్ష్యంతో బలిచేసుకోవద్దని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతినిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను గమనిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ భార్య రజితకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చేవిధంగా ప్రతిపాదనలు పంపించామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రాధిక, పోలీసు కార్యాలయం అధికారి డి.పుష్పరాజ్, సెక్షన్ అధికారి యండి యూనిస్ అలీ, సిసి రవీందర్ సింగ్, బాధిత కుటుంబ సభ్యులు కె.లక్ష్మి, సతీష్‌లు పాల్గొన్నారు.