అదిలాబాద్

కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జూలై 3: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి కార్యకర్తలందరూ కృషిచేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఉమ్మడి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని దారాబ్ది జిన్నింగ్ ఫ్యాక్టరీలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అధ్యక్షతన జరిగిన ముధోల్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సోనియాగాంధీ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి తెలంగాణను వరంగా ఇస్తే కేసి ఆర్ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. సోనియా దయవల్లే రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడం అర్దరహితమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చిన ముఖ్యమంత్రి హామీలు మరిచి తన కుటుంబంలో అల్లుడు, కూతురు, కోడళ్లకు పదవులు ఇచ్చి ప్రజలనుమోసం చేశారని అన్నారు. ఒకవైపు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తూనే మరోవైపు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో వచ్చిన పెన్షన్ విద్యుత్ బిల్లులకు సరిపోయేదిగా ఉందన్నారు. డబుల్‌బెడ్‌రూమ్‌లు రుణమాఫి, వంటివి పథకాలతో ప్రజలను ఆకర్షించి నట్టేట ముంచారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం వారంలో నాలుగు రోజులు ఎర్రవెల్లి ఫౌంహాస్‌లో గడుపుతూ ఇతర పార్టీ నేతలను పార్టీల్లో చేర్చేందుకు ఫాంహౌస్‌లో వ్యూహరచనలు చేస్తున్నారన్నారు. ఎర్రవెల్లిలో 20 కోట్లు వెచ్చించి రోడ్లు, మురికి కాలువలు, ఇండ్లు నిర్మిస్తున్న ముఖ్యమంత్రి, వేరే జిల్లాల్లో అభివృద్దిపై ఇందుకు దృష్టిసారించడం లేదని ప్రశ్నించారు. మన ఊరు మన ప్రణాళికతోపాటు గ్రామజ్యోతి కార్యక్రమాలు రూపకల్పన చేసినప్పటికి గ్రామాల్లో కనీసం జ్యోతులు వెలిగించేందుకు నూనెలేక రైతాంగం అల్లాడుతుందన్నారు. ఒకేసారి రుణం మాఫీచేయడంతో రైతులు ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నారని అన్నారు. రైతులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించేది కాంగ్రెస్ పార్టీయేనని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు టి ఆర్ ఎస్‌నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, వర్కింగ్ కమిటి అధ్యక్షులు అనిల్ జాదవ్, డిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంధర్‌రావు, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గంగాభవాని,మైనార్టీ అధ్యక్షులు సాజిద్‌ఖాన్, ఎస్సీసెల్ అధ్యక్షులు భూమన్న, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోహన్‌రావు పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు దిగంబర్‌రావు పటేల్, భైంసా మాజీ మార్కెట్ కమిటి అధ్యక్షులు ఆనంద్‌రావుపటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయినాథ్, శ్యాంరావు పటేల్, శంకర్ చంద్రే,దామాజి పాల్గొన్నారు.