అదిలాబాద్

ఆదిలాబాద్ మార్కెట్ పీఠంపై వీడని చిక్కుముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 3: జిల్లాలో ఊరిస్తూ వచ్చిన మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోంది. జిల్లాలోని 17 మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు రిజర్వేషన్లను ప్రకటించగా ఇప్పటికే పది మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియమాకాలకు ఎమ్మెల్యేలు పూర్తి ప్రతిపాదనలు నివేదించగా, ప్రభుత్వం చైర్మన్ పదవులను ఎమ్మెల్యే సూచించిన నేతలకు ఖరారు చేసింది. అయితే జిల్లాలోని మూడు నోటిఫైడ్ మార్కెట్ కమిటీ స్థానాల్లో చైర్మన్ పదవులను ఎస్టీలకే రిజర్వ్ చేయాలని డిమాండ్ తెరపైకి రావడంతో ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ కమిటీగా పేరున్న ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ పదవికి టీఆర్‌ఎస్ నేతల నుండి డిమాండ్ పెరగడం, స్థానిక రాజకీయ అంశాలు, వర్గ సమీకరణలపై మంత్రి జోగు రామన్న ఎటుతేల్చుకోలేక పోతున్నారు. ఏడాది కాలం పాటు సాగే చైర్మన్ పదవి కోసం ముగ్గురు నేతల మధ్య ఏడాది కాలంగా ఉత్కంఠరేగుతూనే ఉంది. టిడిపి పార్టీని వదిలి నాగం జనార్దన్ రెడ్డి శిబిరంలో చేరిన జోగు రామన్నకు టిడిపి నుండి నేతల మద్దతు అప్పట్లో లేకపోవడంతో పార్టీ నుండి తాంసి మండలానికి చెందిన అడ్డి బోజారెడ్డి కుడిబుజంగా వ్యవహారిస్తూ చివరకు టీఆర్‌ఎస్ పార్టీలో రామన్న చేరే వరకు అండగా నిలిచారు. గతంలో మార్కెట్ చైర్మన్ పదవిలో కొనసాగిన అనుభవం ఉండడంతో ఆయన పేరు ముందు వరసలో ఉన్నప్పటికీ ఇటీవల టీఆర్‌ఎస్‌లో ముదిరిన రాజకీయ వర్గపోరు నేపథ్యంలో బోజారెడ్డి పేరు సిఫారసుపై మంత్రి రామన్న సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు మాత్రం బోజారెడ్డికి పదవి రాకుండా అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మంత్రి రామన్నకు ఇటీవల ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న ఆరె రాజన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిసి వర్గంలో మున్నూరు కాపు కోటా కింద ఆరె రాజన్నకు కేటాయించాలని ఆ వర్గం నుండి ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. మరోవైపు పార్టీలో సీనియర్ నాయకుడిగా పేరున్న బాలూరి గోవర్దన్‌రెడ్డి చైర్మన్ పదవిని ఆశిస్తూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంత్రి రామన్నతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే గోవర్దన్‌రెడ్డి పేరు ఖరారు చేయాలని ఆ వర్గానికి చెందిన టిఆర్‌ఎస్ నేతలు మంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో భైంసా మార్కెట్ కమిటీ చెర్మన్ పదవి ఎస్సీ వర్గానికి రిజర్వ్ కాగా, నాలుగు రోజుల కిందటే చైర్మన్ పదవిని ఎమ్మెల్యే ఖరారు చేశారు. అయితే కీలకమైన ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎవరిని నియమించినా వర్గపోరు తప్పదని పలువురు పేర్కొంటున్నారు. మరో నాలుగు రోజుల్లో మంత్రి రామన్న ఆచితూచి ఒక పేరును ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ పదవి కోసం ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ మంత్రి రామన్న ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.