అదిలాబాద్

కాల్వ పనులు గాలికి వదిలి ఇఎండి డబ్బుల ఇవ్వడానికి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, జూలై 3: మండలంలోని బంబార గ్రామంలో 2010లో నిర్మించిన చెరువుకు దాదాపు 1.70కోట్లతో నిర్మించిన ప్రధాన కాల్వ నిర్మాణ పనులు గాలికివదిలి ఇఎండి డబ్బుల కోసం సదరు కాంట్రాక్టర్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసిందని ఆ డబ్బులు ఇవ్వకుండా అధికారులు ముందుగా కాల్వను బాగు చేయించి తర్వాతనే ఆ సొమ్ములను ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బంబార చెరువు నుండి గోండ్‌కొసార, ఖైరిట్ మీదుగా దాదాపు నాలుగు కిలోమీటర్లు నిర్మించిన చెరువు ప్రధాన కాల్వ నిర్మాణం చేసినప్పటి నుండి చుక్కనీరు కూడా పారలేదని, నీళ్ళు పారకుండానే కాల్వ మొత్తం గండ్లుపడిందని, ఈ చెరువు నీటిని దాటించడానికి నిర్మించిన రెండు కాజ్‌వేలు కాల్వకు సంబందంలేకుండానే ఉన్నాయని దీంతో కాల్వ నిర్మించినట్లు పేరేగాని ఇప్పటివరక చెరువు ప్రధాన కాల్వ కిందకు చుక్కనీరు పారలేదంటున్నానరు. దాదాపు 10కోట్లతో నిర్మించిన బంబార చెరువుకు 5 వందల ఎకరాలు ఆయకట్టుగా అధికారులు గుర్తించారు. దానికి చెరువు నిధులతో సంబందంలేకుండా 2012-13లో దాదాపు 1.70కోట్లు ప్రధాన కాల్వ నిర్మాణం చేపట్టారు. కొన్నిచోట్ల కాల్వ సరిగ్గా లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడల్లా కాల్వ మట్టితో నిండిపోవడంతోపాటు అక్కడకక్కడ తెగిపోయింది. ఇదిలా ఉండగా, ఈ కాల్వ నిర్మించే సమయంలో ఉన్న ఎతైన ప్రదేశాన్ని కట్ చేశారు. అయితే అక్కడ కాల్వ నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేదని దీంతో అక్కడి నుండి నీరు పారడంలేదంటున్నారు. ఒకటి రెండు చోట్ల గుట్టలను కట్‌చేసి కాల్వ నిర్మాణం చేపట్టారు. అయితే ఇంది భాగంలో బాగా లోతుగా వెళ్ళడంతో అక్కడకక్కడ ఇందున్న పెద్ద పెద్ద రాళ్ళు సరిగ్గా కట్‌కాలేదని దీంతో సైతం నీరు పారడం గగనంగా మారిందంటున్నారు. చెరువు ప్రధాన కాల్వ నిర్మించిన కాంట్రాక్టర్ చెల్లించిన 2.5 శాతం ఇఎండి, సొమ్ములు ఇచ్చేందుకు అధికారులు ప్రణాలికలు సిద్ధ చేస్తున్నట్టు వినికిడి.