అదిలాబాద్

ఊరూరా, ఇంటింటా మొక్కలు నాటండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జూలై 8: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇంటింటా మొక్కలు నాటాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మి, సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సబ్ కలెక్టర్, ఎంపిడిఓ, పంచాయతీరాజ్ కార్యాలయాలతోపాటు జెడ్పీ మైదానంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మి మాట్లాడుతూ అడవులు అంతరించి పోవడంవల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతిందని, దీంతో వర్షాలు కురవక కరువువిలయ తాండవం చేస్తోంద న్నారు. కలప స్మగ్లింగ్ కారణంగా అటవీ సంపద పాడైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటే భయంకర రోగాల బారినపడే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రభుత్వం హరితహారం పేరిట రాష్టవ్య్రాప్తంగా కోట్లాడి మొక్కలను నాటేందుకు ప్రణాళికలను రూపొందించిందని, ఇందులోభాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోవలక్ష్మి పిలుపునిచ్చారు. తొలిరోజే నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటనున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో, వీధుల్లో, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలు సంతోషంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపిపి తారాబాయి, జెడ్పీటిసిలు ఏమాజీ, అరిగెల నాగేశ్వర్‌రావు, డిఎఫ్‌ఓ వెంకటేశ్వర్లు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బద్రి సత్యనారాయణ, సింగిల్ విండోఛైర్మెన్ అలీ, ఎంపిడిఓ శ్రీనివాస్, తహశీల్దార్ బక్కయ్య, ఎంఇఓ ఉదయ్‌బాబు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ విష్ణు, ఎస్‌హెచ్‌ఓ సతీష్ కుమార్, ఎంపిటిసిలు గుర్రాల హరిప్రియ, ఎకిరాల సుగుణాకర్, మేకల నారాయణ, నాయకులు ప్రవీణ్ గౌడ్, విద్యార్థినులు పాల్గొని మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన పోలీసులు
హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఆసిఫాబాద్ పోలీసులు పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్‌హెచ్‌ఓ సతీష్‌కుమార్, ఎస్‌ఐ నరేష్ కుమార్, పోలీసులు, యూనిటీయూత్ రైడర్స్, సంఘసేవ యూత్ అసోసియేషన్ సభ్యులు పోలీసు స్టేషన్ పరిసరాల్లో 200 మొక్కల వరకు నాటారు. అలాగే సబ్‌కలెక్టర్, ఎంపిడిఓ, తహశీల్దార్, పంచాయతీ రాజ్,అటవీ శాఖ కార్యాలయాలతోపాటు ఎఫ్‌ఎం వసతిగృహం, ఆయా పాఠశాలల్లో అధికారులు, విద్యార్థులు మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు వివరించారు.