అదిలాబాద్

జిల్లాలో ముంచెత్తిన వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా గురువారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం పశ్చిమ జిల్లాలోని తలమడుగు, తాంసి, జైనథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, భైంసా, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో 4 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా గుడిహత్నూర్, ఇచ్చోడలో సాధారణం మించి వర్షాలు కురిశాయి. భైంసా, తానూరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు గడ్డెన్న వాగు జలాశయం నిండుకుండలా తలపిస్తుండగా గోదావరిలోకి వరద నీరు వచ్చిచేరడంతో కడెం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కడెం ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి 17500 క్యూసెక్కుల నీరు చేరడంతో అధికారులు ముందు జాగ్రత్తగా 21వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా 697 అడుగుల స్థాయిలో నీటిని నిల్వ ఉంచారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ, తంతోలి, లోకారి వాగులు, జైనథ్ మండలంలోని నిరాల వాగు, బజార్‌హత్నూర్ మండలంలోని బల్హాన్‌పూర్ (కడెం) వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బల్హాన్‌పూర్ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆర్టీసి బస్సులు, ప్రైవేట్ వాహనాలు బోథ్ మీదుగా నడిపించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 431 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రికార్డు స్థాయిలో 625 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పత్తి సాగు చేస్తున్న రైతులకు కలుపుకోత భారంగా మారుతుండగా ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతంలో వరిసాగు చేసే రైతులకు ఈ వర్షాలు ఎంతగానో అనుకూలిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఖానాపూర్, కడెం, లక్సెటిపేట్, జన్నారం, దండేపల్లి ప్రాంతాల రైతులు వరినాట్లకు సిద్దమవుతున్నారు.