అదిలాబాద్

ఏజెన్సీ పల్లెల్లో ముసురుకున్న వ్యాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 22: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తున్నా యి. నాలుగైదు రోజులుగా జిల్లాలోని ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బీమిని, జన్నారం, నార్నూర్, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో విషజ్వరాల బారిన పడి వందలాది మంది గిరిజనులు ప్రతిరోజు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. విష జ్వరాల భారిన పడి జిల్లాలో వారం రోజుల్లోనే ముగ్గురు మృతి చెందిన సంఘటన అధికార యంత్రాంగం కలకలం సృష్టించగా పలు వసతిగృహాల్లోనూ విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఉట్నూ రు ఆసుపత్రితోపాటు ఏజెన్సీలోని పలు పిహెచ్‌సిల్లో విషజ్వరాలతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య క్రమంగా పెరుగుతూఉంది. గత ఏడాది వర్షాకాలంలో రిమ్స్ ఆసుపత్రిలోనే 4200 మంది గిరిజనులు వైద్యసేవలు అందించుకున్నట్లు రికార్డులు చెబుతుండగా ఈసారి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్ ఆకస్మికంగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి గిరిజనులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. విషజ్వరాలు, అతిసార వ్యాధి తో బాధపడుతున్న వారి వార్డులను పివో పరిశీలించి, వారికి అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని సూచించారు. గిరిజన భాషల్లోనే వారికి వైద్య చికిత్సల గురించి డాక్టర్లు వివరించాలని, ప్రత్యేక శ్రద్ధ చూపించాలని రిమ్స్ డైరెక్టర్ అశోక్‌కు సూచించారు.