అదిలాబాద్

మానవ మనుగడ కోసం మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూలై 22: మానవ మనుగడ కోసం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో ఎస్పీ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ అటవీ సంపదను పెంపొందించడానికి ప్రతీ ఒక్కరు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడంతోపాటు నాటిన మొక్కలను పరిరక్షించుకోవాలన్నారు. మొక్కలు నాటినప్పుడే పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని ఆయన తెలిపారు. మొక్కలు పెంచడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. అటవీ సంపద తగ్గినట్లయితే అతివృష్టి, అనావృష్టి ఏర్పడడానికి కారణమవుతుందన్నారు. జిల్లాలో అడవులు ఎక్కువగా ఉన్నాయని, 23 శాతం ఉన్న అడవులను 33 శాతం పెంచే విధంగా హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, జడ్పీ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్‌సిసి విద్యార్థులు, పోలీసు సిబ్బంది జిల్లా దుగ్గల్ ఆధ్వర్యంలో దాదా 1600 మొక్కలు నాటారు. అనంతరం జనమైత్రిలో కార్యక్రమంలో భాగంగా కడెం పోలీస్‌స్టేషన్ మైదానంలో పోలీస్‌శాఖ అధికారులు, ఎస్సై, సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ప్రారంభించారు. నూతన పార్కులో ఎస్పీ వెళ్లి కొద్దిసేపు నూతన పార్కులోని ఊయలలో కూర్చుని ఊగారు. ఆ తర్వాత కడెంలోని కొలాం గిరిజన పిల్లలకు ఎస్పీ దుగ్గల్ బిస్కెట్‌లు, స్వీట్లను పంపిణి చేశారు. కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ మనోహర్‌రెడ్డి, ఖానాపూర్ సిఐ నరేష్‌కుమార్, ఎస్సైలు ఆరిఫొద్దిన్, బాలకృష్ణ, అజయ్‌బాబు, శంకర్ నాయక్, రవీందర్, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.