అదిలాబాద్

కుంటాలలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుంటాల, జూలై 22: మండల కేంద్రమైన కుంటాలలో గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో శుక్రవారం ఉదయం నుండి కుంటాల మండలానికి రాకపోకలు నిలిచిపోయి పంటలు నీట మునిగిపోయాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి 91.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎఎస్‌వో సాయన్న తెలిపారు. దీంతో ఉదయం నుండే మండలానికి రాకపోకలు నిలిచిపోవడంతోప్రయాణీకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుంటాల నుండి నిర్మల్ పట్టణానికి వెళ్లాలంటే అంబకంటి, నందన్, బామ్ని, నర్సాపూర్ మీదుగా ప్రయాణీకులు వెళ్లారు. భైంసా పట్టణానికి వెళ్లాలంటే ఓల, లింబా, భైంసా మండలంలోని సుంక్లీ గ్రామాల మీదుగా ప్రయాణీకులు గమ్యానికి చేరుకోవాల్సి వచ్చింది. భారీ వర్షం మూలంగా కల్లూర్‌లోని కుంటాలకు వచ్చే మార్గంలో అంధకూర్ అలుగు తీవ్రంగా ప్రవహించడంతో సాయంత్రం వరకు కూడా రాకపోకలు నిలిచిపోయి అంతరాయం కలిగింది. దీంతోపాటు భారీ వర్షానికి మండలంలోని ఆయా గ్రామాల్లో పత్తి, సోయా పంటలు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఏర్పడింది. వీటిని స్థానిక తహశీల్దార్ సంతోష్‌రెడ్డి, పిఎస్‌ఐ యూనుస్ పరిశీలించి ప్రమాదస్థలంలో ప్రయాణీకులకు హెచ్చరికలు జారీచేశారు.