అదిలాబాద్

విరివిగా మొక్కలు నాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఏ ఎన్ రెడ్డి కాలనీ, మల్లన్నగుట్టపై గల అయ్యప్ప ఆలయ ఆవరణలో, పాత బస్టాండ్‌లోని జామా మసీదు ఆవరణలో, ఆర్డివొ కార్యాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామన్నారు. మొక్కలు పెరిగి పెద్దవైతేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, వర్షాలు కురిస్తే రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ప్రజలు, స్వచ్చంద సంస్థలు, ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో శివలింగయ్య, మున్సిపల్ చైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నాయకులు అల్లోల మురళీదర్‌రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, పాకాల రాంచందర్, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, జామా మసీదు కమిటి సభ్యులు పాల్గొన్నారు.