అదిలాబాద్

ఆర్థిక ఇబ్బందులతో గిరిజన యువ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నారం, జూలై 28: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, సంతానం కాలేదన్న మనస్థాపంతో ఓ గిరిజన యువ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోండుగూడెంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే జన్నారం మండలం కలమడుగు గ్రామ పరిధిలోని గోండుగూడకు చెందిన పెందూర్ కిరణ్ (26) పెందూర్ అంజలి(23)కి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. పేదరికంతో మగ్గుతున్న ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అధికం కావడం, మరోవైపు మూడేళ్లు గడిచిన సంతానం లేదన్న చింత అప్పుడప్పుడు కుటుంబంలో మనస్పర్థల కారణంగా వీరిద్దరూ బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో పురుగుల మందు తాగారు. అర్ధరాత్రి అరుపులు వినిపించడంతో వెంటనే తండ్రి పెంద్రం లింబు వారిని చూడగా అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. వెంటనే గ్రామస్తుల సహకారంతో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్ గ్రామానికి చేరుకునే లోపే వీరిద్దరూ మృతి చెందారు. కిరణ్ తండ్రి పేంద్రం లింబున వివరాల మేరకు కొద్దిరోజులుగా తన ఆరోగ్యం బాగాలేనందున కుమారుడు కిరణ్ అప్పులు చేసి తనకు వైద్యం చేయించాడని, అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపంచెంది ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు రోధిస్తూ తెలిపాడు. అర ఎకరం భూమిలో పంటలు పండకపోవడంతో భూమిపై అప్పులు చేశాడని, అవి తీర్చలేక మనోవేధనతో తన కుమారుడు కిరణ్, కోడలు అంజలిలు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందన్నారు. ప్రతి రోజు కూలీపని చేసుకొని జీవించే తమకు ఇలాంటి దుస్థితి వస్తుందని ఉహించలేదన్నారు. కాగా, గురువారం దంపతులిద్దరికీ అంత్యక్రియలు చేయడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. లింబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎఎస్సై మజారోద్దిన్ తెలిపారు.