అదిలాబాద్

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూలై 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్భందీగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్‌లోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని ఆదేశించారు. మొక్కల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటి ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. గ్రామాల్లోని ప్రతీ ఇంట్లో మొక్కలు నాటేలా ఇంటి యజమానుల్లో చైతన్యం తేవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా, ఇతర ఖాళీస్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని ఆదేశించారు. గ్రామాల్లోని రైతులకు అవగాహణ కల్పించి పొలంగట్లపై మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పంట పొలాల్లో గట్లపైన విరివిగా మొక్కలు నాటడం వల్ల అవి పెరిగి పెద్దవైన తర్వాత ఆ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్న విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నాటిన మొక్కలు ఎండిపోకుండా అవసరమైతే అగ్నిమాపక శాఖ సహకారాన్ని తీసుకుని ప్రతీ మొక్కకు నీరందేలా చర్యలుతీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో శివలింగయ్య, డిఎఫ్‌వొ రాంకిషన్, మున్సిపల్ చైర్మెన్ అప్పా గణేష్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ త్రయంబకేశ్వర్‌రావు, మార్కెట్ కమిటి ఛైర్మెన్ దేవేంధర్‌రెడ్డి, నాయకులు రాంకిషన్‌రెడ్డి, పాకాల రాంచందర్, ఆయా మండలాల ఎంపిడివొలు, తహశీల్దార్‌లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.