అదిలాబాద్

వైద్య ఆరోగ్య శాఖలో 2118 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, ఆగస్టు 4: వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 2118 పోస్టులను త్వరలో టిఎస్‌పిఎస్సీ ద్వారా ఈ ఏడాది భర్తీచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక పిఎమ్మార్సీ భవనంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి ఏజెన్సీ వ్యాధులు, అందుతున్న వైద్య సేవలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చి ఆసుపత్రులకు కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. ఏజెన్సీలో విషజ్వరాల వలన గత సంవత్సరం అనేక మంది చనిపోయారని, కాని ఈ సంవత్సరం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మరణాలను నివారించారన్నారు. ఆగస్టు 15లోగా రాష్ట్ర బాలల స్వస్థ కార్యక్రమం జిల్లాలో ప్రారంభించి, ఇంటింటికి వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2లక్షల ట్రైమ్‌కిన్ మాత్రలు పంపిణీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులపై జూన్ మాసం నుండే ప్రజలను చైతన్యవంతులను చేశామని, జ్వరాలు వస్తే మందులు వాడేలా అవగాహన కల్పించడంతోనే మరణాలు తగ్గాయన్నారు. తిర్యాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని నియమించడంతో పాటు సకల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. పంచాయతీ శాఖ, ఆర్‌డబ్ల్యూ ఎస్, వైద్య శాఖ అధికారులు మరింత కష్టపడి పనిచేసినట్లయితే పూర్తిస్థాయిలో వ్యాధులను అదుపులోకి తీసుకరావచ్చని అన్నారు. అనంతరం ఏజెన్సీ మండలాల వారీగా మంత్రి లక్ష్మారెడ్డి వైద్య సేవలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, కోవలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లేష్ గౌడ్, జిల్లా వైద్యాధికారి జలపతి నాయక్, అదనపు వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి అల్హాం రవి, ఆర్డీవో ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.