అదిలాబాద్

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైనూర్, ఆగస్టు 4: ఏజెన్సీలో గిరిజనులు విష జ్వరాలతో బాధపడుతున్న విషయం వాస్తవమేనని, ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినందున వైద్యసేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి కోరారు. గురువారం జైనూర్ మండలంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ఐకెరెడ్డిలు పర్యటించి, ఉసేగావ్, దేవుగూడ పిహెచ్‌సిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అనంతరం పిహెచ్‌సి పరిధిలో మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గిరిజన రోగులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించేందుకు ఐటిడిఏ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సేవలను మంత్రి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జైనూర్ ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన అనంతరం వారికి అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్, డిఎంఆండ్‌హెచ్‌వో అల్హాం రవి, అడిషనల్ డిఎంఆండ్ హెచ్‌వో ప్రభాకర్ రెడ్డి, ఎస్‌పిహెచ్‌వో శ్రీనివాస్, ఎంపిడీవో దత్తరాం, తహశీల్దార్ శంకర్‌గౌడ్, డిఎస్పీ మల్లారెడ్డి, ఎస్సై ప్రభాకర్, ఎంపిపి కోటప్ప విమల ప్రకాష్, జడ్పీటీసీ ఆష్రాఖానం, టీఆర్‌ఎస్ నాయకులు ఇంతియాజ్ లాలా, సుబూర్‌ఖాన్, రవీందర్, యాదవ్‌రావ్, గేడం లక్ష్మణ్, మాదవ్, జావీద్‌లు పాల్గొన్నారు.