అదిలాబాద్

జిల్లాలో ఆగని గిరి మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 4: జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో విష జ్వరాలు డయేరియా వ్యాధులు గిరిజనులను కుదిపేస్తున్నాయి. కిషోర బాలుర నుండి వృద్దుల వరకు వ్యాధులు అతలాకుతలం చేస్తున్నా జిల్లా యంత్రాంగం ఆశించినస్థాయిలో స్పందించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి గురువారం ఏజెన్సీలోని ఉట్నూరు, జైనూర్, సిర్పూర్‌యు మండలాల్లో పర్యటించి వైద్యసేవలపై ఆరా తీయగా ఆసుపత్రుల్లో అడుగడుగునా వైద్య సిబ్బంది ఖాళీలు, సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఆపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపించింది. మంత్రి రెండు రోజుల పర్యటనలో జిల్లాలో వ్యాధుల తీవ్రత స్వయంగా చవిచూసినా సీరియస్‌గా స్పందించకపోవడం విమర్శలకు తావిచ్చింది. మంత్రుల ఏజెన్సీ పర్యటన జరుగుతుండగానే నార్నూర్ మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మేడిగూడ గిరిజన గ్రామంలో వాగ్మారే మారుతి (52) అనే వ్యక్తి డయేరియాతో మృతి చెందాడు. వారం రోజుల్లోనే ఈ గ్రామంలో డయేరియా భారిన పడి నలుగురు మృత్యువాత పడగా మరో నలుగురు మహారాష్టల్రో చికిత్స పొందుతున్నారు. ఇదేరోజు భీమిని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కలుషిత నీరు సేవించి 36 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురికాగా 16 మంది విద్యార్థినిల పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఆసుపత్రికి తరలించి, చికిత్సలు అందిస్తున్నారు. పలు గిరిజన గ్రామాల్లోనూ రోగాల భారిన పడి అనేక మంది ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన పల్లెల్లో ర్యాఫిడ్ పీవర్ సర్వేతో వ్యాధుల తీవ్రత వెలుగులోకి వచ్చినా వాటి నియంత్రణకు ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ముఖ్యంగా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అపరిశుభ్రతతో పాటు దోమల బెడద, డాక్టర్ల పర్యవేక్షణ లోపం, హెడ్‌క్వాటర్‌లలో వైద్యులు ఉండకపోవడం తదితర సమస్యలు మంత్రి దృష్టికి వచ్చాయి. బుధవారం రాత్రి వైద్యాధికారులతో మంత్రి జరిపిన సమావేశంలో వ్యాధుల మాట పక్కనపెట్టి స్వయంగా వైద్యాధికారులే తమ సమస్యల గోడును ఏకరవు పెట్టడంతో మంత్రి లక్ష్మారెడ్డి కంగుతినాల్సి వచ్చింది. డిఎంఆండ్‌హెచ్‌వో, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వాహనాల మరమ్మత్తులకే డబ్బుల కొరత ఉందని గోడు వెల్లబోసుకోగా మరికొందరు డాక్టర్లు గ్రామాల్లో తిరిగే తమకు టిఏ, డిఏ ఏడాది కాలంగా అందడం లేదని, వాహనాల బిల్లులు ఇప్పటి వరకు నయపైసా చెల్లించలేదని వాపోయారు. అంతేగాక ఐటిడి ఏ పివో ఆర్‌వి కర్ణన్ గిరిజన గ్రామాల్లో గైనకాలజిస్టుల కొరత, వారి సేవలు అంతంతా మాత్రంగానే ఉండడం వల్ల గర్భిణీ మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, సుఖ ప్రసవాలు జరగడం లేదని అందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది వ్యాధుల తీవ్రత జిల్లాలో అధికంగా ఉండగా వైద్య శాఖ మంత్రి మాత్రం కేవలం ఐదుగురు మాత్రమే మృతి చెందారని పేర్కొనడం వ్యాధులను ప్రభుత్వం కప్పిపుచ్చుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 31 పిహెచ్‌సిలలో 45 రోజుల పాటు ర్యాపిడ్ సర్వే నిర్వహించి 2,03,628 మంది రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీటిలో 4664 మందికి అతిసార కేసులు, 30,389 మందికి విషజ్వరాలు, 570 మందికి టైఫాయిడ్, 214 మందికి మలేరియా ఫాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం గమనార్హం. జిల్లాలో మునుపెన్నడు లేని విధంగా వ్యాధులు పట్టిపీడిస్తుండగా ప్రతి రోజు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతుండగా వైద్య సేవలు మాత్రం నామమాత్రంగానే అందుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై గురువారం కాంగ్రెస్ నేతలు ఉట్నూరులో మంత్రి లక్ష్మారెడ్డిని నిలదీసి వ్యాధుల తీవ్రతను వివరించడం గమనార్హం.