అదిలాబాద్

ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిర్యాణి, ఆగస్టు 4: ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ పేర్కొన్నారు. తిర్యాణి మండలంలోని రోంపల్లి గ్రామంలో గురువారం జనమైత్రి, పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా వైద్య శిభిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరష్కరించడానికి పోలీసులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించి అభివృద్దికి బాటలు వేసుకోవాలన్నారు. గుండాల గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం రూ.25లక్షలు మంజూరయ్యాయన్నారు. అలాగే గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారుల మద్యలో గల చెడిపోయిన కల్వర్టులను గుర్తించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కల్వర్టులకు మరమ్మత్తులు జరిగేలా కృషి చేస్తామన్నారు. అసాంఘీక శక్తులకు ఎవరు సహకరించవద్దన్నారు. ప్రజల అభివృద్దికి తాము ఏ కార్యక్రమం చేపట్టడానికైనా సిద్దంగా ఉన్నామని, కేవలం శాంతిభద్రతల సమస్యలే కాకుండా ఎలాంటి సమస్యలున్నా ప్రజలు నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని, వెంటనే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమాజాభివృద్ది విద్యతోనే ముడిపడి ఉందని, ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను చదివించుకోవాలన్నారు. ప్రస్తుతం అంటు వ్యాధుల సీజన్ ఉన్నందున ప్రజలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఎవరు ఏ చిన్న అనారోగ్యానికి గురైనా వెంటనే చికిత్సలు చేయించుకోవాలన్నారు. అలాగే ఈ వైద్య శిభిరాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం వృద్దులకు, అనాథ పిల్లలకు బట్టలు, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు పంపిణీ చేశారు. కాగా ఈ శిభిరంలో వైద్యులు గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డీ ఎస్పీ రమణారెడ్డి, తాండూర్ సిఐ కరుణాకర్, తిర్యాణి ఎస్సై బుద్ద స్వామి, రోంపల్లి, మాణిక్యపూర్ సర్పంచ్‌లు దేవు, కమల, గ్రామ పటేల్‌లు భీము, జలపతి, తిర్యాణి వైద్యాధికారులు స్పురణ, రజిత, వెంకటేష్, కరీంనగర్ పట్టణానికి చెందిన సన్‌రైజ్, స్టార్, అపోలోరీచ్ ఆస్పత్రుల వైద్యులు సురేష్, కార్తీక్, శ్రీనివాస్, అఖిలేష్, ఆంజనేయులు, మైఖేల్, ఆయా గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.