అదిలాబాద్

కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, ఆగస్టు 4: కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగని ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన సాగు నీటి ప్రాజెక్ట్‌లను రీడిజైనింగ్ పేరుతో మాయ చేస్తు తన అనుచరులకు ముఖ్యమంత్రి కెసిఆర్ పనులు కట్టబెడుతున్నాడని ఆయన ఆరోపించారు. మహుబూబ్‌నగర్ జిల్లాలో మూడు ప్రాజెక్ట్‌లు కాంగ్రెస్ హయంలో శంకుస్థాపనలు చేస్తే ఇటీవల కెసిఆర్ శంకుస్థాన చేయడం శోచనీయమన్నారు. ఎంసెట్-2 ను రద్దుచేసి 50వేల మంది విద్యార్థుల ఉసురుపోసుకోవడం సరికాదని దానికి బాధ్యులైన విద్యా, వైద్యశాఖ మంత్రులను భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెరాస ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం విఫలం చెందిందని కేవలం మాటలతో కాలాయాపన చేయడం తప్పా అభివృద్దిపై ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధలేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రగాల్భాలు పలికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు మూడు మాసాలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదు ఇచ్చిన కాస్తో కూస్తో వడ్డిలకు కూడ సరిపోవడంలేదని వేంటనే పూర్తి రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు పడకల గదుల ఇస్తామన్నా ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఇళ్ళు ఇవ్వలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి ఎంత మందికి ఇచ్చారో శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, లక్సెటిపేట, మంచిర్యాల మాజి మార్కెట్ కమిటీ చైర్మన్లు కొత్త సత్తయ్య, కమాలకర్ రావు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, లక్సెటిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కల కృష్ణ, మాజి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మర్రి ప్రవీణా రెడ్డి, డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ బొమ్మెన మల్లేష్, నాయకులు మోత్కురి వెంకటస్వామి గౌడ్, తాళ్ళపేట సర్పంచ్ కొమురం లింగారావు, బండ ఉదయ్, అల్లంల సంతోష్ యాదవ్, బిల్లకురి శంకరయ్య, బొలిశేట్టి లక్ష్మినారాయణలు పాల్గొన్నారు.