అదిలాబాద్

ప్రజా వ్యతిరేక విధానాలపై టిడిపి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, ఆగస్టు 4: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ హెచ్చరించారు. గురువారం ఆర్డీవో కార్యలయం ముందు టిడిపి అధ్వర్యంలో ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్‌కు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా తెలుగు యువత రాష్ట్ర నాయకుడు రితిష్ రాథోడ్ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నాలో లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు అధికారంలోకి వచ్చామని చెబుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దాదాల తెలంగాణగా మారుస్తున్నారని అన్నారు. పూటకోమాట.. గంటకోమాటతో పబ్బంగడుపుతూ నిరుద్యోగులను నిర్లక్ష్యంచేస్తూ సొంత ఇంటిలో ఉద్యోగాలు పెంచుకుంటున్నారని అన్నారు. రైతు రుణమాఫీ, భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. డబుల్ బెడ్ రూం పథకం కింద పేదలను ఆదుకుంటామని చెప్పిన కెసిఆర్ సికింద్రాబాద్‌లో 600 ఇండ్లు కట్టించి రాష్టమ్రంతా ప్లెక్సీల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల హామీలను పూర్తిగా మర్చిపోయి, వ్యవసాయ ఫాంహౌస్‌లో కెసిఆర్ నిద్రపోతున్నారన్నారు. కేవలం ఆయన వ్యవసాయం బాగుంటే సరిపోదని, రాష్టమ్రంతంటా రైతులు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రితిష్ రాథోడ్ మాట్లాడుతూ పేద రైతుల కోసం మంజూరైన ట్రాక్టర్లలో అవినీతి చోటుచేసుకుందని, ఒక్కో లబ్దిదారుని నుండి ఎమ్మెల్యే రూ.50వేలు వసూలు చేస్తుందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, నాయకులను టిడిపి వదిలిపేట్టేది లేదని, ప్రజల పక్షాన ఉంటూ పోరాటాలు చేస్తుందన్నారు. అనంతరం ఐటిడిఏ ముందు నిరవదిక దీక్ష చేస్తున్న రెండవ ఎఎన్‌ఎంలకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ధన్‌లాల్, శంకరయ్య, రాజేశ్వర్, పరుశురాం, బాలాజీ, ఆశన్న, శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.