అదిలాబాద్

కస్తూర్బా విద్యాలయంలో ప్రబలిన డయేరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, ఆగస్టు 4: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గత మూడు రోజులుగా 35మంది విద్యార్థినిలు విరేచనాలు, వాంతులు, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురవగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సలు అందించారు. అనంతరం విద్యార్థినిలను వారి ఇండ్లకు పంపించినట్లు ప్రత్యేకాధికారి నారాయణ రావు తెలిపారు. గురువారం ఉదయం 16మంది విద్యార్థినిలు విరేచనాలు, వాంతులతో సతమతమవుతుండగా వారికి కూడా చికిత్సలు అందించినట్లు తెలిపారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడంతో విద్యార్థినిలు వ్యాధుల భారిన పడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో తాగునీటి సౌలభ్యం లేక విద్యార్థినిలు చేతి పంపు నీటిని సేవిస్తున్నారని, పాఠశాలలో విద్యార్థులు ఉపయోగించే నీరు తరగతి గదుల వెనుక భాగంలో గుంతలా ఏర్పడి దోమలు అభివృద్ది చెందుతున్నాయని తల్లిదండ్రులు ఈ విషయాన్ని ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపిడివో శంకరమ్మ ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థినిలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని, వంట గదిని శుభ్రంగా ఉంచేలా చూడాలని, మూత్రశాలలు, మరుగుదోడ్లలో బ్లీచింగ్ పౌడర్‌తో ఎప్పుటికప్పుడు పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మినరల్ వాటర్ అందించాలని సూచించారు. ఎంపిడివో వెంట సీనియర్ అసిస్టెంట్ గిరిధర్‌రావు, ఈవోపిఆర్‌డి శంకర్‌లు ఉన్నారు.