అదిలాబాద్

రెండేళ్లలో బీడు భూములకు పెన్‌గంగా జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 28: ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో ఇనే్నళ్లుగా వృదాగా పోతున్న పెన్‌గంగా జలాలను బీడు భూముల్లోకి మళ్ళించి ఆదిలాబాద్ ప్రాంతాన్ని సస్యశామలం చేయడ మే ప్రభుత్వ లక్ష్యమని, రూ.368 కోట్ల వ్యయంతో మంజూరైన పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో చెనాకకోర్ట బ్యారేజీ నిర్మాణ పనుల్లో భాగంగా ఆదివారం మంత్రి జోగు రామన్న కలెక్టర్ జనగ్మోహన్‌తో కలిసి హట్టిఘాట్ వద్ద నిర్మించే పంపుహౌస్ పనులను, గూడ గ్రామం వద్ద నిర్మిస్తున్న కాల్వల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నాణ్యతతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన గడవులోగా లోయర్ పెన్‌గంగా బ్యారేజి నిర్మాణ పనులు పూర్తిచేసి 55వేల ఎకరాలకు సాగునీరందించేందుకు అధికారులు, ఇంజనీర్లు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యంవల్ల పెన్‌గంగా జలాలు సముద్రంలోకి వృధాగా పోయాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గోదావరి నదీ జలాలను బీడు భూముల్లోకి మళ్ళిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ఆధికారంలో ఉన్నప్పుడు పెన్‌గంగా ప్రాజెక్టు గురించి ఏనాడు మాట్లాడని నేతలు ప్రస్తుతం చెనాకకోర్ట వద్ద నీటినిల్వ సామర్థ్యం 0.83 టిఎంసిల నిల్వ ఉందని, దీనివల్ల కొన్ని గ్రామాలకు నీరు వచ్చే అవకాశం లేదని దుష్ప్రచారం చేయడాన్ని రామన్న తీవ్రంగా ఖండించారు. పెన్‌గంగా ప్రాజెక్టు భావితరాలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.1227 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం రెండేళ్లలో సాగునీరు అందించాలన్న లక్ష్యంతో బ్యారేజి నిర్మాణం కోసం రూ.368 కోట్లు మంజూరు చేయడమేగాక టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు. రైతులకు మేలుచేకూర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా చరిత్ర సృష్టిస్తున్నారని తెలిపారు. బ్యారేజీ ప్రధాన కాలువకు కావాల్సిన నీటి ప్రవాహ సామార్థ్యం 405 క్యూసెక్కులుగా నిర్ధారించబడిందని, హట్టిఘాట్ వద్ద పంపుహౌస్‌లోని బ్యారేజి సామార్థ్యం 13.50 క్యూసెక్కులుగా రూపకల్పన చేయడం జరిగిందని మంత్రి అన్నారు. చెనాకకోర్ట వద్ద 0.83 టిఎంసీల ద్వారా నీటి నిల్వ ఉంచుతూ నవంబర్ తర్వాత రెండో పంటకు సాగునీరందించేందుకు వీలవుతుందన్నారు. చెనాకకోర్ట ద్వారా తాంసి మండలంలోని 36 గ్రామాలకు, జైనథ్ మండలంలోని 3 గ్రామాలతో పాటు ఆదిలాబాద్ మండలంలోని ఒక గ్రామానికి సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. లోయర్ పెన్‌గంగా ప్రధాన కాల్వల ద్వారా 47 కి.మీటర్ల నుండి 89 కి.మీటర్ల పొడవు వరకు 37,300 ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. తాంసి మండలంలో 13,500 ఎకరాలకు సాగునీరందించేలా మహారాష్టత్రో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మంత్రి రామన్న వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, అపోహలకు లోనుకావద్దని మంత్రి వివరించారు. పెన్‌గంగా ప్రాజెక్టుకు ఎలాంటి నిధుల కొరత లేదని, 2018 జూన్‌లోగా సాగుజలాలు అందిస్తామని మంత్రి రామన్న స్పష్టం చేశారు. ఇరిగేషన్ సిఈ భగవంత్‌రావు మాట్లాడుతూ బ్యారేజి వద్ద 6 పంపు హౌస్‌లు నిర్మిస్తున్నామని, వీటిలో లోయర్‌పెన్‌గంగా రిజర్వాయర్ వద్ద 3 పంపుహౌస్‌లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో సంజీవరెడ్డి, పెన్‌గంగా ఎస్ ఈ అంజద్, డిఈ తులసిరాం, ఎస్‌ఈ శ్రీనివాస్, సర్పంచ్ టి.రమేష్, తహసీల్దార్లు ప్రభాకర్ రావు, టీఆర్‌ఎస్ నాయకులు చంద్రయ్య, లింగారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎ బోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.