అదిలాబాద్

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బియ్యాల తిరుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్సెట్టిపేట, ఆగస్టు 28: లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బియ్యాల తిరుపతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చేరి పార్టీ జెండా పట్టుకొని పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని గ్రామాల్లోని యువకులను సైతం ఉత్తేజపరిచాడు. తెలంగాణ వచ్చే ముందు సకల జనుల సమ్మె కాలంలో ఆయన ప్రతీ రోజు గోదావరిలో స్నానమాచరించి తెలంగాణ రావాలని గంగాదేవి ఆలయంలో పూజలు చేశాడు. ఇదివరకు ఎంపిటిసిగా పనిచేసిన అతన్ని గుర్తించిన అదిష్టానం ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు ఆశీస్సులతో మార్కెట్ కమిటీ పీఠాన్ని అప్పగించారు. పలుమార్లు సర్పంచ్‌గా తిమ్మాపూర్ గ్రామంలో పోటీచేసి ఓడిపోయినా నిరుత్సాహపడకుండా తెరాస పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. మండలంలో ఎంతోమంది నాయకులు ఈ పీఠం పై కనే్నసినా చివరకు తిరుపతినే ఈ పదవి వరించింది. తనపై నమ్మకముంచి తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిని అప్పగించడం పట్ల పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.