అదిలాబాద్

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలతో పాటు విద్యారంగాన్ని అభివృద్దిపర్చేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం మండలంలోని ముక్రాకె గ్రామంలో రూ.28లక్షల నిధులతో నిర్మించిన పాఠశాల అదనపు గదులు, కోకస్‌మన్నూర్ గ్రామంలో సుమారు రూ.19లక్షల నిధులతో నిర్మించిన ప్రైమరి పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవంతో పాటు హరితహారం, ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్న అనంతరం కోకస్‌మన్నూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గ్రామాల్లో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ముఖ్యంగా తాగు, సాగునీటితో పాటు రహదారుల అభివృద్ది, విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీనికోసం నిధులకు వెనకాడకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. కోకస్‌మన్నూర్ గ్రామానికి రూ.20కోట్ల నిధులతో సాంఘీక గురుకుల పాఠశాల (బాలుర) మంజూరయ్యందని, దీంతో పాటు గ్రామంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల కోరికమేరకు చెరువును కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. కోకస్‌మన్నూరు గ్రామంలో జరిగిన అభివృద్దిని చూసి ఎమ్మెల్యే స్థానిక సర్పంచ్ నరాల రవీందర్‌ను అభినందించారు లాభపేక్ష లేకుండా కేవలం గ్రామాభివృద్దే దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లయితే వారి సేవలను గ్రామస్తులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. గ్రామంలో మినిరల్ ప్లాంట్‌తో పాటు గ్రామపంచాయతీ ఆవరణలో నెలకొన్న పచ్చదనం, పరిశుభ్రతను చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామాలన్నీ దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు ఆమీనాభి, పిఏసిహెచ్ చైర్మెన్ అబ్దుల్ రషీద్, స్థానిక తహసీల్దార్ మోహన్‌సింగ్, ఎంపిడీవో రమాకాంత్‌లతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు గాడ్గె సుభాష్, శ్రీనివాస్ రెడ్డి, మిరాజ్ ఆహ్మాద్ తదితరులు పాల్గొన్నారు.